శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అప్పికట్ల రైలు దోపిడీ భవారి గ్యాంగ్ పనే

2 గంటల క్రితం

gnt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 04:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రధాన నిందితుడు అరెస్ట్... వివరాలు వెల్లడించిన రైల్వే డి.ఎస్.పి

ప్రజాశక్తి తెనాలి (గుంటూరు జిల్లా): తెనాలి చెన్నై మార్గంలో అప్పికట్ల వద్ద సర్కార్ ఎక్స్ప్రెస్ లో జరిగిన దోపిడీ రాజస్థాన్‌కు చెందిన భవారి గ్యాంగ్ పనే అని రైల్వే డిఎస్పి అక్కేశ్వరరావు చెప్పారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న లఖన్ అలియాస్ ముఖేష్ ను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తెనాలి రైల్వే పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పి అక్కేశ్వరరావు మాట్లాడుతూ రాజస్థాన్‌కు చెందిన భవారి గ్యాంగ్ అత్యంత క్రూరమైన గ్యాంగ్ అని చెప్పారు. గత నెల 16 అర్ధరాత్రి తెనాలి- చెన్నై రైలు మార్గంలో అప్పికట్ల వద్ద సిగ్నల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి రైలులో ప్రవేశించి ప్రయాణికుల నుంచి ఆభరణాలు దోచుకున్న ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులు పాల్గొన్నట్టు పేర్కొన్నారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఎస్కార్ట్ పై కూడా కత్తులతో దాడి చేసి పరారయ్యారని, పోలీసుల ఫైరింగ్ కు కూడా దొరకలేదన్నారు. అయితే ఈ ఘటనలో పాల్గొన్నది పాకిస్తాన్ బోర్డర్ కు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘర్షణ గ్రామానికి చెందిన వారని గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటికే ఒకరిని అరెస్టు చేయగా కీలకమైన రెండో ముద్దాయిని జి ఆర్ పి, ఆర్పిఎఫ్ బృందాలు ఐదు జల్లెడ పట్టి లఖన్ అలియాస్ ముఖేష్ ను అరెస్టు చేసి నట్లు చెప్పారు. మిగిలిన నలుగురిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో రైల్వే సిఐ, ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్