- అఖిలభారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్
ప్రజాశక్తి-ఏలూరు : దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకుండా రైతు ఆత్మహత్యలకు కారణం అవుతుందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు ఏలూరు నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కళాకారుల డప్పు దరువులతో నృత్యాలతో ఉత్సాహపూరితమైన వాతావరణంలో నెలకొంది 23వ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు అఖిలభారతసందర్భంగా ఏలూరు నగరంలో నలుమూలల అరుణ పతాకాల అలంకరణలు రైతన్నల అడుగులతో హోరెత్తింది. చిరుజల్లుల మధ్య అన్నదాతలు కిసాన్ సభ జెండాలతో ఏలూరు నగరంలో భారీ కవాతు నిర్వహించారు. ముందుగా జూట్ మిల్ సెంటర్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి భారీ కార్మిక ప్రదర్శన రైతన్నల నినాదాలతో ప్రారంభమైంది. ఫైర్ స్టేషన్ మీదుగా జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ వద్ద ఉన్న ఇండోర్ స్టేడియం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య అధ్యక్షత వహించారు. బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన వీజు కృష్ణన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్పోరేట్ అనుకూల వ్యవసాయ విధానాలను తీవ్రంగా విమర్శ చేశారు. అమెరికాలో ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి 32 లక్షల రూపాయల రాయితీలుస్తుంటే భారతదేశంలో మాత్రం రైతన్నలో చేసే వ్యవసాయాన్ని దండగ మారిన పనిగా మార్చేస్తున్నారని వాపోయారు. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నల ఆత్మహత్యలు ప్రతి ఏటా పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 ఏళ్ల కాలంలో 10 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్ర ప్రభుత్వంపైఆగ్రహం వ్యక్తం చేశారు.
భూమిపై పనిచేస్తూ పంట పండిస్తున్న ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మంది కౌలు రైతులకు ఎటువంటి రాయితీ అందడం లేదని ఇది ఎంతవరకు సమంజసమో పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమెరికా కార్పొరేట్ వ్యవసాయ అనుకూల విధానాలను ఈ దేశంలో అమలు చేసేందుకు మోడీ ప్రభుత్వం తహతహలాడుతుంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నోరెత్తకుండా భజనపరులుగా మారిపోయారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా మోడీ చట్టాలకు వంత పాడుతుంటే జగన్మోహన్ రెడ్డి మౌనం వహిస్తున్నారని రెండు వేరు వేరు మాత్రం కాదని అన్నారు.
కరోనా లాక్ డౌన్ తర్వాత ప్రజలపై భారాలు కార్పొరేట్లకు సేవలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం మునిగి తేలుతుందని పేర్కొన్నారు రైతుకు రాయితీ ఇవ్వడానికి సిద్ధం లేని ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు భూములను ఇస్తూ వేలకోట్ల రూపాయలను మాఫీ చేస్తూ ప్రజల సంపదలను దోచిపెడుతుందని ధ్వజమెత్తారు.
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీ కృష్ణయ్య కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి జిల్లాల్లో సాగునీరుతోపాటు రైతుల రక్తం కూడా ఆత్మహత్యల రూపంలో సెలయేరుల పారుతుందని చెప్పారు గోదావరి జిల్లాలోని ఇలాంటి పరిస్థితుంటే కరువు జిల్లాలు వెనుకబడిన జిల్లాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఉదహరించారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 4,000 కోట్ల రూపాయల కేటాయిస్తే ప్రాజెక్టు పూర్తయిపోతుందని ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు ఎకరాలకు సాగునీరు అందుతుందని అయినా సరే పాలకులు నిధులు కేటాయించకుండా తాత్సారం చేస్తున్నారని అన్నారు. ఉచిత పంటల భీమా లేక రైతులు రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం దగ్గర నిధులు లేవంటూనే గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు 80 వేల కోట్ల రూపాయలు కేటాయించారని రాష్ట్రంలో కొద్దిపాటి బడ్జెట్తో ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉన్న నిర్లక్ష్యం వాడికి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయినప్పటికీ పూర్తి కాకపోవడంతో నిరుపయోగంగా మారిందని చెప్పారు.
కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి బలరాం మాట్లాడుతూ రాష్ట్రంలో సన్నాసిన్న కారు మధ్యతరగతి సేద్యం చేస్తుంటే ప్రభుత్వం కవులు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు కౌలు రైతులకు అన్యాయం చేసిందని తాము వస్తే కౌవులు రైతులను ఆదుకుంటామని ఓటమి ప్రభుత్వం రెండేళ్లు గడుస్తున్న ఎటువంటి చర్యలు చేపట్లేదని అన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేకపోవడంతో పంట నష్ట పరిహారాలు రుణాలు అందకపోవడంతో కౌవులు రైతుల ఆత్మహత్యలు వ్యతిరేకంగా పెరుగుతున్నాయని విమర్శించారు. రైతుకు గిట్టుబాటు ధరన్నించకుండా ఎరువులు ధరలు మాత్రం ఆకాశానంటే ఇలాగా ధరలు పెంచుతున్నారని పెరిగిపోవడంతో రైతులు దిక్కుతోతల స్థితికి నెట్టవేయబడుతున్నారని చెప్పారు.
రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే కేజీ బేసిన్లో ఉన్న చమురు నిక్షేపాలు ఆయిల్ నిక్షేపాలు ప్రజలకు వాటా అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆక్వా రైతులు కూడా దివాలా తీసే పరిస్థితులు పాలకులు విధానాల కారణంగా ఏర్పడిందని చెప్పారు.
కొల్లేరు సమస్య దశాబ్దాలుగా హామీల రూపంలో తప్ప ఆచరణ లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పారు.
కొల్లేరుకు వలస పక్షులు వలస రావడమే కాకుండా కొల్లేరు ప్రజలు కూడా వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడిపోయాయని అయినా సరే పాలకొల్లుకు చీమకుట్టినట్లు కూడా లేదని దుయ్యబట్టారు.
బహిరంగ సభకు రైతాంగ ఉద్యమ నిర్మాత కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి స్వగ్రామం పోతునూరు నుండి అల్లూరి సీతారామ రామరాజు స్వగ్రామం పాలకోడేరు మండలం మోగల్లు నుండి రైతు ఉద్యమ నాయకుడు గాదిరాజు శ్రీరామరాజు స్వగ్రామం భీమవరం నుండి ఆ చిత్రపటాలను తీసుకువచ్చి అఖిల భారత రాష్ట్ర నాయకులకు అందజేస్తూ నినాదాలు రూపంలో నివాళులర్పించారు.
వేదికపై అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి టి సాగర్ రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు పోలవరం నిర్వాసితుల సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం నాయకులు ఎం సూర్యనారాయణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మహిళా జిల్లా కన్వీనర్ ఎం నాగమణి కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పివి రామకృష్ణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పట్టా భాస్కరరావు జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ సీతారామయ్య కోన శ్రీనివాసు రాంబాబు, కోర్స జలపాలు ఆంజనేయులు మోహన్ రావు హేమలత శివశంకర్ తదితరులు పాల్గొన్నారు 4 5 తేదీలలో డీసీఎంఎస్ కాన్ఫరెన్స్ హాల్లో రైతు సంఘం రాష్ట్ర మహాసభ కొనసాగనుంది రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రతినిధులు ఏలూరు విచ్చేశారు.







కామెంట్‌లు (0)