నేడు అవార్డు అందుకున్న కమిషనర్ బాలస్వామి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహణలో విజయనగరం నగరపాలక సంస్థ రాష్ట్రంలో మూడో స్థానం సాధించి, అవార్డుకు ఎంపికైంది. ప్రథమ స్థానంలో మచిలీపట్నం, రెండవ స్థానంలో మదనపల్లి నిలిచాయి. మే 22వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో అనేక పరిశుభ్రత కార్యక్రమాలు నగరంలో చేపట్టడం జరిగింది. శనివారం నిర్వహించనున్న అవార్డుల ప్రదానోత్సవంలో తృతీయ స్థానం దక్కించుకున్న విజయనగరం నగరపాలక సంస్థ అవార్డును కమిషనర్ బాలస్వామి స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ బాలస్వామి మాట్లాడుతూ ... ప్రజలు, సిబ్బంది సహకారంతోనే ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో అవార్డు సాధించగలిగామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.








కామెంట్‌లు (0)