15 మే 2026 (రోజు–1)
'కాక్‌రోచ్' వ్యాఖ్యతో వివాదం ప్రారంభం
• సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన "కాక్‌రోచ్" వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అయింది.
• నిరుద్యోగ యువతను అవమానించారని విమర్శలు వెల్లువెత్తాయి.
• తరువాత వ్యాఖ్యను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
అభిజీత్ దిప్కే సోషల్ మీడియాలో ప్రశ్న
బొద్దింకలన్నీ ఒక చోట చేరితే ఏమవుతుంది?
• అమెరికాలో ఉన్న రాజకీయ కమ్యూనికేషన్ నిపుణుడు అభిజీత్ దిప్కే ఎక్స్‌లో ఈ ఒక్క పోస్టు పెట్టారు.
• గంటల్లో లక్షల వ్యూస్ వచ్చాయి.
• ఇదే తర్వాత సిజెపి కి నాంది అయింది.
17 మే
కాక్రోచ్ జనతా పార్టీ జననం
• సిజెపి పేరుతో వెబ్‌సైట్, సోషల్ మీడియా పేజీలు ప్రారంభం.
• వేలాది మంది యువత చేరిక.
20–31 మే
సోషల్ మీడియా ఉద్యమం
• నిరుద్యోగం
• పరీక్షల అవకతవకలు
• ప్రభుత్వ జవాబుదారీతనం
మూడు ప్రధాన అంశాలపై ప్రచారం.
6 జూన్
అభిజిత్ భారత్‌కు రాక
• అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.
• జంతర్ మంతర్ వద్ద తొలి బహిరంగ సభ.
• మొదటిసారి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేశారు.
"ఇది నిరసన కాదు... భవిష్యత్తు కోసం పోరాటం."అని ప్రకటించారు,
జూన్ మధ్యలో
నీట్ లీక్ ఉద్యమానికి ఊపిరి
• లక్షలాది విద్యార్థులు 'సిజెపి తో కలిశారు.
• దేశవ్యాప్తంగా నిరసనలు.
28 జూన్
రంగంలోకి సోనం వాంగ్‌చుక్
• జంతర్ మంతర్‌కు చేరుకున్నారు.
• ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు.
• నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.
1–17 జులై
దేశవ్యాప్తంగా ఉద్యమం
• ప్రతి రాష్ట్రంలో నిరసనలు.
• పార్లమెంట్ బయట ఆందోళనలు.
• ప్రభుత్వం–సిజెపి మధ్య అనధికార చర్చలు.
18 జూలై
వాంగ్‌చుక్ ఆరోగ్యం విషమం
• 20/21 రోజుల దీక్ష తర్వాత ఢిల్లీ పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు.
• బలవంతపు తరలింపు సిజెపి ఆరోపణ
• పలు చోట్ల ఆందోళనలు
18 జులై సాయంత్రం
అభిజీత్ దీక్ష ప్రారంభం
• వాంగ్‌చుక్ స్థానంలో అభిజీత్ నిరాహార దీక్ష చేపట్టారు.
. ఎస్ఎఫ్ఐ నాయకులు కూడా దీక్ష ప్రారంభించారు.
• జంతర్ మంతర్ కు ప్రవాహంలా విద్యార్థులు యువ
• ఉద్యమం మరింత ఉధృతమైంది.
20 జులై
పార్లమెంట్ మార్చ్,
• పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన విద్యార్థులు, యువత
• ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇంటర్ నెట్, మొబైల్ సేవలు నిలిపివేత
• మెట్రో రైల్వే స్టేషన్లు మూసివేత
• అయినా భారీగా చేరుకున్న యువత, విద్యార్థులు
• విద్యార్థులపై పెద్ద ఎత్తున సర్కారు హింస
• లాఠీలు, వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్, ఎలక్ర్టిక్ బ్యాటన్లు, పిల్లట్ గన్లు ఉపయోగించిన పోలీసులు
21-22 జులై
జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున కొనసాగిన ఆందోళనలు
పార్లమెంట్లో చర్చకు ప్రతిపక్షాల పట్టు
23 జులై
• ప్రభుత్వం–సిజెపి చర్చలు
• ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు తిరస్కరణ
23 జులై
వాంగ్‌చుక్ దీక్ష ముగింపు
అర్ధరాత్రి ప్రధాని వీడియో సందేశం విడుదల.
• 26 రోజుల నిరాహార దీక్ష ముగిసింది.
• ప్రభుత్వం కొన్ని చర్యలకు ప్రభుత్వం హామీ.
• తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించిన సిజెపి
24 జులై
సిజెపి నాయకులతో కేంద్రం చర్చలు
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సిజెపి పట్టు
25 (రోజు–72)
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
• కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా.
• జంతర్ మంతర్ వద్ద సంబరాలు.
• ఇది ముగింపు కాదు. ప్రారంభం అని సిజెపి ప్రకటన.
• ఉద్యమ విజయంగా అభివర్ణన








కామెంట్‌లు (0)