జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ముగ్గురు కోతులు’. ఈ మూవీలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ముఖ్య పాత్రల్ని పోషిస్తుండగా.. వర్షిక పాశం హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఈ టైటిల్‌కి తగ్గట్టుగా ముగ్గురు హీరోల పాత్రల్ని చూపిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ముగ్గురు హీరోలు రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ పెట్టి కనిపిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం జనాల్లో క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఈ సినిమాకి ఎస్. సుహాస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీకి రాజ్ నోముల కెమెరామెన్‌గా, జమీర్ షేక్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో ఆడియెన్స్‌ని అలరిస్తామని టీం కాన్ఫిడెంట్‌గా ఉంది.
నటీనటులు : తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్, వర్షిక పాశం తదితరులు
సాంకేతిక బృందం
సమర్పణ : జీఎస్ఆర్ క్రియేషన్స్
సహ సమర్పణ : స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్
నిర్మాత :శోభారాణి గరిమెల్ల
దర్శకుడు :కార్తీక్ గరిమెల్ల
కెమెరా :రాజ్ నోముల
సంగీతం :ఎస్. సుహాస్
ఎడిటింగ్ :జమీర్ షేక్
పీఆర్వో : సాయి సతీష్








కామెంట్‌లు (0)