శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

షుగర్ కేసులు ఎక్కువ.. షుగర్ ధర పెరిగితే ఏం కాదు..

1 గంట క్రితం

bihar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 06:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్

పాట్నా: బీహార్‌లో చక్కెర ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం డయాబెటిస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది చక్కెర వినియోగాన్ని తగ్గించారని, ఈ రోజుల్లో ఎవరు ఎక్కువగా స్వీట్లు తింటున్నారని ఆయన ప్రశ్నించారు. అందువల్ల చక్కెర ధర పెరిగినా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో కిలో చక్కెర ధర సుమారు రూ.48–50గా ఉండగా, ప్రస్తుతం రూ.65కి పెరిగింది. దీనిపై స్పందిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చక్కెర ధరల పెరుగుదలకు డయాబెటిస్‌ను కారణంగా చూపడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘ఆవు పేడలో ఎంత నెయ్యి పోసినా అది ఆవు పేడే. ఇలాంటి మంత్రి నుంచి ఏం ఆశించగలం?’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో గ్యాస్, టమాటా ధరలు పెరిగినప్పుడు స్మృతి ఇరానీ సహా పలువురు నాయకులు ఇదే విధంగా వ్యాఖ్యలు చేశారని పప్పూ యాదవ్ గుర్తుచేశారు. ఇప్పుడు చక్కెర ధరలు పెరిగితే డయాబెటిస్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘‘అసలు అతిపెద్ద డయాబెటిస్ ప్రభుత్వానికే ఉంది’’ అంటూ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్