వాషింగ్టన్ : అమెరికా వ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లను ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) నిలిపివేసింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలో వైఫల్యం తలెత్తడంతో భద్రతా కారణాల దృష్ట్యా దేశవ్యాప్తంగా గ్రౌండ్‌స్టాప్ ప్రకటించింది. అప్పటికే గాల్లో ఉన్న 4,042 విమానాలకు సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు అనుమతించింది.
ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 11 వేలకుపైగా విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి. వెయ్యికి పైగా విమానాలు రద్దు కాగా, సుమారు 10 వేల విమానాలు ఆలస్యంగా నడిచాయి. 2001 తర్వాత అమెరికాలో దేశవ్యాప్తంగా గ్రౌండ్‌స్టాప్ విధించడం ఇది రెండోసారి.







కామెంట్‌లు (0)