ఆదివారం, 19 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

7 గంటల క్రితం

amarnath yatra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 10:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీనగర్: ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రసిద్ధ అమర్‌నాథ్ యాత్రను అధికారులు నేటి నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బాల్తాల్, పహల్గాం మార్గాల నుంచి యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. భారత వాతావరణ శాఖ జారీ చేసిన నివేదికల ప్రకారం, జులై 19 నుంచి 23 వరకు జమ్మూకశ్మీర్‌లోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనివల్ల ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదంతో పాటు, కొండచరియలు విరిగిపడటం, నదుల్లో నీటిమట్టం పెరగడం వంటి ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ పరిణామాల దృష్ట్యా యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. పరిస్థితులు మెరుగుపడిన అనంతరం యాత్రను తిరిగి ప్రారంభించే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, ఇప్పటివరకు సుమారు 3.7 లక్షల మంది భక్తులు అమర్‌నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్