ఆదివారం, 27 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిజెపి సహవ్యవస్థాపకుడు అశుతోష్‌ రంకా అరెస్ట్‌

51 నిమిషాల క్రితం

Ashutosh Ranka
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 01:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గువహటి : అస్సాంలోని గువహటిలో కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) సహ వ్యవస్థాపకుడు అశుతోష్‌ రంకా, ఆయన బృందాన్ని పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. అస్సాంలోని పాఠశాలల వాస్తవ పరిస్థితులను బయటకు వెల్లడిస్తే.. వాటి దుస్థితి గురించి దేశానికి తెలిసిపోతుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భయపడుతున్నారని రంకా అన్నారు. కజిరంగాలో ప్రజల హక్కులను ఎలా హరిస్తున్నారో, అలాగే భూమి, అడవులు, నీటి వనరులను లాక్కొని కార్పొరేట్ సంస్థలకు ఎలా కట్టబెడుతున్నారో అందరికీ తెలుసునని అన్నారు. వాస్తవాలు బయటపడతాయని హిమంత బిస్వా శర్మ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

అస్సాం పోలీసులు అశుతోష్ రంకా, సిజెపి బృందాన్ని అదుపులోకి తీసుకున్నారని, వారిని రహస్య ప్రదేశానికి తరలించారని సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే సోషల్‌ మీడియా ఎక్స్‌లో పేర్కొన్నారు. అశుతోష్‌ , అతని బృందం అస్సాంలో స్వచ్ఛంద కార్యకర్తలతో ఒక చిన్న సమావేశం నిర్వహించాల్సి ఉందని అన్నారు. వారిని ఎక్కడైతే అదుపులోకి తీసుకున్నారో.. ఆ ప్రాంతం వెలుపల న్యాయవాదులు ఉన్నారని, కానీ పోలీసులు వారిని లోపలికి అనుమతించడం లేదని దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్