ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపెను సవాళ్లు విసురుతున్న డ్రగ్స్‌..డార్క్‌ వెబ్‌..ఉగ్రవాదం

4 రోజుల క్రితం

పెను సవాళ్లు విసురుతున్న 
డ్రగ్స్‌..డార్క్‌ వెబ్‌..ఉగ్రవాదం 
- బిమ్‌స్టెక్‌ దేశాల హోంమంత్రుల 
తొలి సదస్సులో అమిత్‌ షా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 01:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • బిమ్‌స్టెక్‌ దేశాల హోంమంత్రుల తొలి సదస్సులో అమిత్‌ షా

న్యూఢిల్లీ : ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు, డార్కు వెబ్‌ ఇవన్నీ ఒకదానికి ఒకటి ముడిపడి పెను సవాళ్లుగా మారుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌ ఏనాడూ వెనక్కి తగ్గలేదని, ఈ విషయంలో సభ్య దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోని దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకార పెంపుదల లక్ష్యంగా భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ సభ్య దేశాలుగా ఏర్పాటైన బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిఐఎంఎస్‌టిఇసి-బిమ్‌స్టెక్‌) దేశాల హోంమంత్రుల తొలి సమావేశం న్యూఢిల్లీలో మంగళవారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ..మాదకద్రవ్యాల అక్రమ రవాణా పెద్ద సమస్యగా మారిందని, ఈ అక్రమ రవాణాను ఒక్క దేశం మాత్రమే అడ్డుకోలేదని, అన్ని దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అమిత్‌ షా తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం ద్వారా వచ్చే డబ్బు నేర ముఠాలకు బలాన్ని ఇస్తోందని, అదే డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల తయారీలో ఉపయోగించే రసాయనాలను అక్రమంగా మళ్లించడం, డార్క్ వెబ్ ద్వారా లావాదేవీలు జరపడం వంటి చర్యల వల్ల ఈ సమస్య మరింత క్లిష్టంగా మారుతోందని చెప్పారు. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి ఒక్కో దేశం విడివిడిగా ప్రయత్నించడం కాకుండా, మొత్తం ప్రాంతం ఒకటిగా భావించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉగ్రవాదం, నేర ముఠాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి సమస్యలపై ఉమ్మడి కార్యాచరణ అవసరమని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్