గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హర్యానా మాజీ మంత్రి నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

3 గంటల క్రితం

Gopal Kanda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 11:24 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : హర్యానా మాజీ మంత్రి గోపాల్‌ కాండాకు చెందిన గురుగ్రామ్‌ నివాసం, ఫామ్‌హౌస్‌లు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం సోదాలు నిర్వహించింది. అక్రమ రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలకు సంబంధించిన మనీలాండరింగ్‌ దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు సకాలంలో ఆస్తుల స్వాధీనం అప్పగించడం, హామీతో కూడిన రాబడులు, లీజు అద్దెలు, అమ్మకపు పత్రాల రిజిస్ట్రేషన్‌ వంటి హామీలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాటికా లిమిటెడ్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థపై నమోదైన కేసుకు సంబంధించి ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దర్యాప్తులో ఉన్న నాలుగు ప్రాజెక్టుల కోసం 661 మంది పెట్టుబడిదారుల నుంచి రూ.248.46 కోట్లు సేకరించినప్పటికీ, ఇప్పటివరకు వారికి ఆస్తుల స్వాధీనం అప్పగించలేదని, అమ్మకపు పత్రాలను రిజిస్ట్రేషన్‌ చేయలేదని ఈడీ అధికారి తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థ నుంచి మళ్లించిన నిధులను మాజీ మంత్రికి సంబంధించిన వివిధ కంపెనీలకు బదిలీ చేసి ఉండవచ్చని ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో నిధుల కదలికను పరిశీలించేందుకు కాండాకు చెందిన నివాసాలు, ఫామ్‌హౌస్‌లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్