బెంగళూరు : కర్ణాటక ప్రజా పనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి, ఆయన కుమార్తె , చిక్కోడి లోక్‌సభ నియోజకవర్గ ఎంపి ప్రియాంక జార్కిహోళి నివాసాలపై బుధవారం ఈడి దాడులు నిర్వహిస్తోంది. బెంగళూరు, బెళగావి, గోకాక్‌ల్లోని సతీష్ కుటుంబ సభ్యుల నివాసాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సోదాలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. జార్కిహోళి కుటుంబ సభ్యులు, వారి సన్నిహితులు, ఆ కుటుంబానికి సంబంధించిన వ్యాపార సంస్థల కార్యాలయాలు, నివాసాలతో సహా మొత్తం 18 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయని అన్నారు. ఎక్సైజ్ శాఖలో అవినీతి ఆరోపణలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈ ఏడాది జూన్‌లో ఈడి సోదాలు జరిపిన సీనియర్ ఎక్సైజ్ శాఖ అధికారి, సతీష్ జార్కిహోళి బావమరిది వై. మంజునాథ్‌కు సంబంధించిన ప్రాంగణాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మంత్రి సతీస్ జార్కిహోళిపై కేసు
జార్కిహోళి సోదరులపై తాజాగా జరిగిన దాడులకు ఎక్సైజ్ కేసుతో ఎటువంటి సంబంధం లేదని ఈడి తెలిపింది. మంత్రిపై నమోదైన కొత్త కేసుకు సంబంధించి సోదాలు జరుపుతున్నట్లు ఈడి పేర్కొంది. సతీష్ జార్కిహోళిపై కేసు నమోదు చేసినట్లు ఈడి తెలిపింది.








కామెంట్‌లు (0)