ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ - ఏడుగురు విద్యార్థులకు అస్వస్థత

1 గంట క్రితం

Food poisoning at another residential school – seven students fall ill.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 12:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : రాష్ట్రంలో వరుసగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్న వేళ .. మంచిర్యాల జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తినడంతో ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పటికీ, పాఠశాల సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించకుండా నిర్లక్ష్యం వహించారు. అయితే ఈ విషయం పిల్లల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాలకు చేరుకున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడిన తల్లిదండ్రులు తమ పిల్లలను స్వయంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్