ఇరు దేశాల ప్రధానుల అంగీకారం
బ్రిటన్ ప్రధానికి మోడీ ఫోన్ కాల్
న్యూఢిల్లీ : భారత్-బ్రిటన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని ఇరు దేశాల ప్రధాన మంత్రులు నరేంద్ర మోడీ, ఆండీ బర్న్‌హామ్ నిర్ణయించారు. ఇటీవల ఇరు దేశాల మధ్య అమల్లోకి వచ్చిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో వాణిజ్య, పెట్టుబడుల అవకాశాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. బ్రిటన్ ప్రధానికి శుక్రవారం మోడీ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. ఇరు దేశాల సంబంధాల్లోని కీలకాంశాలపై వారు చర్చించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బర్న్‌హామ్‌ను అభినందించినట్లు మోడీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. సాంకేతికత, వినూత్న ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, పరిశుద్ధ ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో కలిసి కృషి చేసేందుకు అంగీకారం కుదిరిందని మోడీ ఆ పోస్టులో పేర్కొన్నారు. బ్రిటన్, భారత్ భాగస్వామ్య ప్రాధాన్యతను ప్రధాని తెలియచేశారని బ్రిటీష్ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.








కామెంట్‌లు (0)