: పీయూష్ గోయల్
న్యూఢిల్లీ : ఈ ఏడాది డిసెంబరులోగా భారత్- 27 యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నుంచి ఈ ఒప్పందాన్ని అమలు చేసే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. చార్టర్డ్ అకౌంటెంట్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం తనతో చర్చలు జరిపేందుకు ఆ దేశ మంత్రి జేమీసన్ గ్రీర్ ఈ వారం భారత్‌కు రానున్నారని తెలిపారు. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని వ్యాఖ్యానించారు.








కామెంట్‌లు (0)