సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విదేశీ రసాయన ట్యాంకర్‌ను కాపాడిన భారత తీర రక్ష‍క దళం

1 గంట క్రితం

Indian Coast Guard
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 05:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఒడిశాలోని పారాదీప్‌ తీరంలో ఒక విదేశీ రసాయన ట్యాంకర్‌ను భారత తీర రక్ష‍క దళం (ఐసిజి) సోమవారం రక్ష‍ించింది. ఇంజన్‌ వైఫల్యం, బ్యాలస్ట్‌ ట్యాంక్ వేగంగా నీటితో నిండిపోవడంతో నౌక ప్రమాదంలో పడిందని అధికారులు తెలిపారు. ఒడిశాలోని పారాదీప్‌కు తూర్పు ఆగ్నేయంగా సుమారు 37 నాటికల్‌ మైళ్లు (సుమారు 68.5కి.మీ) దూరంలో ఘటన జరిగింది. సెంట్రల్‌ అమెరికాలోని బెలీజ్‌ జండా కలిగిన ‘ఎంటి సీగల్‌ 9’ నౌక సుమారు 9,000 మెట్రిక్‌ టన్నుల పామ్‌ ఆయిల్‌ను తీసుకువెళుతోందని అన్నారు. నౌకలో మొత్తం 23మంది సిబ్బంది ఉన్నారని తెలిపింది. ఇంజన్‌ వైఫల్యం, బ్యాలస్ట్‌ ట్యాంక్‌ నీటితో నిండిపోవడంతో ఆదివారం ఉదయం 7.30గంటల సమయంలో నౌక ప్రమాదకరంగా ఒక వైపుకి వంగిపోయిందని అన్నారు. దీంతో నౌక అత్యవసర సహాయం కోరుతూ సంకేతాన్ని పంపిందని చెప్పారు. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ షిప్‌ (ఐసిజిఎస్‌) విశ్వాస్త్‌ రంగంలోకి దిగిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఐసిజి చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ కమాండర్‌ అమిత్‌ ఉనియాల్‌ తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్