శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పిఎం కేర్స్‌ ఫండ్‌ ప్రధాని మోడీ ‘రిటైర్మెంట్ ఫండ్‌’ కోసమా ..!

1 గంట క్రితం

pm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 01:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : పిఎం కేర్స్‌ ఫండ్‌ను ప్రధాని మోడీ తన రిటైర్మెంట్‌ ఫండ్‌గా భావిస్తున్నారా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతి విపత్తులు వచ్చినా ఆ నిధిని ఎందుకు వినియోగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో 2020లో భారతదేశంలో ప్రధాని మోడీ అత్యవసర నిధి పేరుతో ‘పిఎం కేర్స్‌ నిధి’ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించారు. ప్రమాదాలు, ప్రకృతి విప్తత్తులు వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ నిధిని వినియోగించవచ్చని ఊదరగొట్టారు. ఈ నిధికి ప్రజలు కూడా విరివిగా విరాళాలు అందించాలని హోరెత్తించారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పోరేట్లు వేలాది రూపాయలను విరాళాలుగా అందించారు. అయితే సాధారణ ప్రజలు కూడా తమ వంతుగా కొంత మొత్తాన్ని నిధికోసం అందించారు. మార్చి 2025 నాటికి పిఎం కేర్స్‌ ఫండ్‌లో రూ.8,452కోట్లకు చేరింది. అయితే ఆ ఏడాదిలో పిఎం కేర్స్‌ ఫండ్‌ నుండి ఎంత మొత్తాన్ని ఖర్చు చేశారు. కేవలం రూ.87.85 లక్ష‍లను మాత్రమే. సరిగ్గా బ్యాంకులో రూ.8,452కోట్లు ఉన్నాయి. అంటే పిఎం కేర్స్‌ ఫండ్స్‌లో ప్రధానంగా చక్రవడ్డీయే ఖర్చు చేశారని తేలింది. ఎందుకంటే ఆ నిధి మీద ఆ ఏడాది రూ.470 కోట్లు వడ్డీ వచ్చింది. అంటే ఖర్చు చేసిన మొత్తం కన్నా 500 రెట్లు అధికం. కానీ వేల కోట్ల రూపాయలు మాత్రం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో సురక్ష‍ితంగా ఉన్నాయి. అదే సమయంలో వయనాడ్‌ కొండచరియలు విరిగిపడటం సహా దేశం భారీ ప్రకృతి విపత్తులను ఎదుర్కొంది. అయినా రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ప్రజాధనం ప్రైవేట్‌ నిధిగా ఎందుకు వినియోగించకుండా ఉండిపోయింది. అంటే ఈ నిధిని ప్రధాని మోడీ తన పదవీవిరమణ నిధిగా భావిస్తున్నారా.. ఇది అత్యవసర నిధి కాదా. ఉపశమనం ముసుగులో కేంద్ర ప్రభుత్వం గందరగోళం సృష్టించిందని స్పష్టమైంది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్