సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

లోక్‌‌సభను ‘ప్రోరోగ్’ చేయకపోవడం అసాధారణం

8 గంటల క్రితం

cong
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 10:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

: కాంగ్రెస్‌

‌న్యూఢిల్లీ : లోకసభ సమావేశం జరిగిన 10 రోజులు దాటిన తరువాత కూడా ఇప్పటి వరకూ సభను మళ్లీ సమావేశపర్చడం కానీ, ప్రోరోగ్‌ (‌నిరవధికంగా వాయిదావేయడం) చేయకపోవడం అసాధారణమని కాంగ్రెస్‌ ‌విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేష్ ఆదివారం ‌సోషల్‌‌మీడియాలో ఒక పోస్టు చేశారు. ఈ నెల 13న జరిగిన లోక్‌సభ సమావేశం తరువాత అసాధారణంగా ‘10 రోజుల జాప్యం’పై ప్రశ్నలు గుప్పించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఆమోదించడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సమీకరించడానికే ఈ జాప్యం జరుగుతుందా.. అని ప్రశ్నించారు. సాధారణంగా లోక్‌‌సభను వాయిదా వేయడం, ప్రొరోగ్‌ ‌చేయడం ఒకే రోజు జరుగుతుందని, లేదా రెండు నుండి నాలుగు రోజుల వ్యవధి ఉంటుందని తన పోస్టులో తెలిపారు. తన వాదనలకు రుజువులుగా ఎం.ఎన్. కౌల్, ఎస్.ఎల్. షక్ధేర్ రచించిన ‘ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్’ అనే పుస్తకంలోని కొని పేజీలను కూడా రమేష్‌ ‌షేర్‌ ‌చేశారు. దీని ప్రకారం, ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ఆర్టికల్ 85(2) కింద సభ సమావేశాన్ని ముగిస్తారు. అలాగే, సభను నిరవధికంగా వాయిదా వేయడం అనేది సాధారణంగా లోక్‌‌సభ సమావేశలు జరుగుతున్నప్పుడే చోటు చేసుకుంటుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్