న్యూఢిల్లీ : జాదవ్‌పూర్ యూనివర్శిటీ ఘర్షణలపై ప్రొఫెసర్ శుభ శంకర్ సర్కార్ విచారణ కమిటీ నుండి వైదొలిగారు. తన పదవికి శుభ శంకర్ సర్కార్ రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. సమర్థవంతంగా విచారణ చేపట్టలేకపోవడమే రాజీనామాకు కారణమని ఒక యూనివర్శిటీ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. విచారణ కోసం యూనివర్శిటీ ఒక కొత్త కమిటీ చీఫ్‌ను నియమిస్తుందని అన్నారు. ఆ కమిటీకి నాయకత్వం వహించలేనని సర్కార్ శనివారం ఈమెయిల్ ద్వారా జాదవ్‌పూర్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ చిరంజీబ్ భట్టాచార్యకు తెలిపారని జెయు తాత్కాలిక రిజిస్ట్రార్ సెలిమ్ బాక్స్ మండల్ పేర్కొన్నారు. తనను నియమించినట్లు సమాచారం అందిన వెంటనే తాను జెయు వైస్ చాన్సలర్‌కు విషయాన్ని వివరించానని శుభ శంకర్ సర్కార్ తెలిపారు. ప్రస్తుతం తాను ఢిల్లీలో ఉన్నానని, ఘటనపై విచారణ కోసం క్యాంపస్‌లోని వ్యక్తులతో తరచుగా సంప్రదింపులు జరపాల్సి వుందని అన్నారు. వర్చువల్ విచారణ చేపట్టాల్సిందిగా యూనివర్శిటీ కోరిందని, కానీ వర్చువల్ విచారణ సమర్థవంతంగా చేపట్టలేమని అన్నారు. జాదవ్‌పూర్ యూనివర్శిటీలో ఆగస్ట్ 20 తెల్లవారుజామున ఎస్‌ఎఫ్‌ఐ, డిఎస్‌ఒ, డిఎస్‌ఎఫ్ సంఘాలు తమపై దాడులు చేశాయంటూ ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్తలు అక్రమంగా యూనివర్శిటీలోకి చొరబడి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఎస్ఎఫ్‌ఐ బ్యానర్లు, పోస్టర్లను చించివేసి, జెండాలు తగలబెట్టారు.
జెయు ఘర్షణలపై విచారణ కమిటీ నుండి వైదొలిగిన చీఫ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 24, 2026, 01:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)