ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు గిగ్‌ వర్కర్లు మృతి

09 జులై, 2026

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 11:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మరో ఇద్దరి పరిస్థితి విషమం

యల్లాపూర్ : కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర తాలూకా అరాబైల్ ఘాట్ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు యువకులు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధార్వాడ్‌లో పార్ట్‌ టైమ్‌గా ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్న 8 మంది స్నేహితులు గోకర్ణ, మురుడేశ్వర, ధర్మస్థల తదితర పర్యాటక ప్రాంతాలను చూసేందుకు కారులో బయలుదేరారు. గురువారం తెల్లవారుజామున యల్లాపుర వద్ద జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహన డ్రైవర్‌ సంజీవ్ (33), అక్షయ్ (26), అభిషేక్ (తండ్రి ఈశ్వర్)(28), అభిషేక్ (తండ్రి మల్లేశ్) (26), బసవరాజు (38), మంజునాథ్ (32) ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సచిన్ (26) చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన శివరాజ్, చెన్నబసప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదం జరిగిందిలా..

బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వీరంతా ధార్వాడ్ నుంచి ధర్మస్థలం వెళ్లేందుకు బయలుదేరారు. యల్లాపుర సమీపంలోని బల్గార్ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్నాయి. దీంతో వీరి వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న యల్లాపూర్ పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వాహనంలో ఇరుక్కుపోయిన వారిని అతికష్టం మీద వెలికితీశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతివేగం, అర్ధరాత్రి దట్టమైన చీకటి, డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం ఈ ఘోర ప్రమాదానికి కారణాలుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఉత్తర కన్నడ జిల్లా కలెక్టర్ లక్ష్మీ ప్రియ, ఎస్పీ దిలీప్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్