గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బురఖాతో లేబర్‌ రూమ్‌లోకి అనుమతించని ప్రొఫెసర్‌.. ఇంటర్న్‌ల నిరసన

1 గంట క్రితం

Medical students
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 11:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని దోడా ప్రభుత్వ వైద్య కళాశాల (జిఎంసి)లో బురఖా ధరించిన మహిళా ఇంటర్న్‌లను లేబర్‌ రూమ్‌లోకి అనుమతించలేదంటూ బుధవారం వందలాది మంది విద్యార్థినులు నిరసన చేపట్టారు. వరుసగా రెండు రోజులపాటు బురఖాలు ధరించిన ఇంటర్న్‌లను లేబర్‌ రూమ్‌ నుంచి బయటకు వెళ్లాలని ఓ మహిళా ప్రొఫెసర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విద్యార్థినులు పేర్కొన్నారు. దీంతో పలువురు ఇంటర్న్‌లు విధులను బహిష్కరించి ఆసుపత్రి భవనం వెలుపల ఆందోళనకు దిగారు. బురఖా ధరించినందుకు తమను లేబర్‌ రూమ్‌లోకి అనుమతించకపోవడమే కాకుండా ప్రొఫెసర్‌ గదిలోకి కూడా రానీయడం లేదని విద్యార్థినులు పేర్కొన్నారు. బురఖా ధరించడాన్ని ప్రొఫెసర్‌ బహిరంగంగా వ్యతిరేకించారని, తమను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఆ ప్రొఫెసర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే ఈనిరసనపై స్పందించేందుకు ప్రొఫెసర్‌ నిరాకరించారు.

విద్యార్థుల నిరసన నేపథ్యంలో ఘటనపై విచారణ జరిపేందుకు దోడా జిఎంసి ఆసుపత్రి యాజమాన్యం కమిటీని ఏర్పాటు చేసింది. నిరసన చేపడుతున్న విద్యార్థులతో సీనియర్‌ పోలీసు అధికారి కూడా చర్చించారు. ముందుగా విద్యార్థులు చేసిన ఆరోపణలను పరిశీలించి, సంబంధిత నిబంధనలను పరిశీలించిన అనంతరం ఎఫ్‌ఐఆర్‌ నమోదు అవసరమా లేదా అన్నది నిర్ణయిస్తామని అధికారి తెలిపారు. ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి సకీనా ఇటూతో తాను ప్రస్తావించినట్లు దోడా ఎమ్మెల్యే మెహ్రాజ్‌ మాలిక్‌ తెలిపారు. ఘటనపై యంత్రాంగం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు ఆయన వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్