గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సైన్స్ సెంటర్ కు టెలిస్కోప్ అందచేత

1 గంట క్రితం

nayudamma
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 12:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చుండూరు: మండలం ఎడ్లపల్లి గ్రామంలోని ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణము నందు తెనాలి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో నిర్వహించబడుచున్న డా.యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ సెంటర్ నందు సైన్స్ ను ప్రయాగపూర్వకంగా నేర్చుకోవడానికి వస్తున్న విద్యార్థుల సౌకర్యార్థం టెలిస్కోప్ ను రావి సాయిబాబు ఫౌండేషన్ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు చేతులమీదుగా ప్రముఖ పారిశ్రామికవేత్త, కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ అధినేత, డా యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యంకి అందచేశారు. ఈ టెలిస్కోప్ ను అమెరికా నుండి రావి సాయిబాబు చిన్న కుమార్తె- అల్లుడు డాక్టర్ .నీలిమ -డాక్టర్ పొన్నగంటి వంశీ పంపించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సైంటిస్ట్ కొల్లి అరవింద్ ఫౌండేషన్ చీఫ్ మెంటార్ రాయపాటి శివనాగేశ్వరరావు, ఫౌండేషన్ కో ఆర్డినేటర్ ఫిజిక్స్ లెక్చరర్ నన్నపనేని సునీల్ కుమార్ మరియు స్కూల్ టీచర్స్ , విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సాయిబాబు విద్యార్థులకు ఎలవర్తి నాయుడమ్మ జీవిత విశేషాలను తెలియజేశారు. ఫౌండేషన్ చైర్మన్ రఘునాథబాబు సుబ్రమణ్యం విద్యార్థులకు తమ శుభాకాంక్షలు అందచేశారు. సైన్స్ సెంటర్ వివరాలు, సైన్స్ లో ప్రయోగాల అవశ్యకతను శివనాగేశ్వరరావు, నన్నపనేని సునీల్ కుమార్ తెలియచేశారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్