గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పదో తరగతి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి

1 గంట క్రితం

tirupati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 12:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

– డీఈఓ కె.వి.ఎన్. కుమార్

ప్రజాశక్తి-రామచంద్రాపురం: ప్రభుత్వ పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపదింపజేసి ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేబీఎన్ కుమార్ కోరారు. గురువారం మండలంలోని నెత్తకుప్పం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈఓ కె.వి.ఎన్. కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి ఎస్ ఎస్ సి మిషన్ మార్చ్ 2027 కార్యక్రమాల అమలును పరిశీలించారు. పరీక్షలపై భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని, ప్రతిరోజూ పాఠాలను పునశ్చరణ చేసుకోవాలని, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. గణిత పరీక్షల మూల్యాంకన పత్రాలను పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా 6వ తరగతి విద్యార్థులు ధరణ్ తేజ్, శరణ్య పాఠశాలకు హాజరు కాకుండా బయట తిరుగుతున్న విషయాన్ని డీఈఓ గుర్తించారు. వెంటనే వారి తల్లిదండ్రులతో మాట్లాడి, కారణం లేకుండా విద్యార్థులను పాఠశాలకు దూరంగా ఉంచవద్దని సూచించారు. విద్యార్థుల హాజరుపై ప్రధానోపా ధ్యాయులు, తరగతి ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న బియ్యం, చిక్కీలు, కోడిగుడ్లను పరిశీలించారు. పాఠశాల మరుగుదొడ్లు, తరగతి గదుల పరిశుభ్రతతో పాటు టాయిలెట్ క్లీనింగ్ మెటీరియల్‌ను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌.ఎం. తులసికుమారి, గణిత ఉపాధ్యాయురాలు రమణమ్మ, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్