గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్ని దెబ్బలు కొట్టినా అడుగు ముందుకే...

2 గంటల క్రితం

youth
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 01:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వీడియో వైరల్

- ప్రశంసల వెల్లువ

న్యూఢిల్లీ: ఢిల్లీ నిరసనలో యువత ధైర్యంగా నిలబడిన తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. జాతీయ జెండాను పట్టుకొని ముందుకు వెళ్తున్న యువకుడిని ఓ పోలీస్ అధికారి ఎత్తి కింద పడేశాడు. ఆ యువకుడు పైకి లేచి జాతీయ జెండాను పైకి ఎత్తి ముందుకు నడిచాడు. దీంతో మరో అధికారి లాఠీఛార్జ్ చేశారు. అయినా ఆ యువకుడు ముందుకే అడుగు వేశాడు. త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి ధైర్యంగా నిలిచిన ఆ వ్యక్తికి సంబంధించిన వీడియో, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రముఖ కార్టూనిస్టు సతీష్ ఆచార్య తన ఎక్స్ ఖాతాలో "త్రివర్ణ పతాకం ధరించిన ఈయనే నిజమైన దేశభక్తుడు, నిజమైన హీరో" అంటూ పోస్టు చేశారు. ఈ ఘటన విస్తృతంగా వైరల్ అవుతుంది. పోస్టులో కనిపిస్తున్న వ్యక్తి జాతీయ జెండాను చేతబట్టి నిలబడిన దృశ్యం పలువురి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో అనేక మంది నెటిజన్లు ఆయన ధైర్యాన్ని, దేశభక్తిని కొనియాడుతూ కామెంట్లు చేస్తున్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్