గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికన్‌ కార్పోరేట్‌ కంపెనీలకు లాభం చేకూర్చేందుకే యుపిఐ ఛార్జీలు : గౌరవ్‌ గొగోయ్‌

2 గంటల క్రితం

gaurav gogoi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 11:55 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : అమెరికన్‌ కార్పోరేట్‌ సంస్థలకు లాభం చేకూర్చేందుకే యుపిఐ లావాదేవీలపై కేంద్రం ఛార్జీలను విధించిందని కాంగ్రెస్‌ ఎంపి గౌరవ్‌ గొగోయ్‌ గురవారం పేర్కొన్నారు. ఈ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై పార్లమెంటు ఆర్థిక వ్యవహారాల స్టాండింగ్‌ కమిటీ ఈ అంశంపై చర్చ జరపలేదని అన్నారు. ఆర్థిక కమిటీ సభ్యులతో సమావేశమైనపుడు ఎండిఆర్‌ ఛార్జీలకు సంబంధించి ఆర్థికశాఖ ఎటువంటి నిర్దిష్ట ప్రతిపాదన చేయలేదని గొగోయ్‌ ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. యుపిఐ ఛార్జీల ఆవశ్యకతపై ప్రభుత్వ ప్రతినిధులు ఎటువంటి ‘‘స్పష్టమైన , సంతృప్తికరమైన ’’ సమాధానాలు ఇవ్వలేదని అన్నారు. ఈ ఛార్జీలు అమెరికన్‌ కార్పోరేట్‌ కంపెనీలకు మేలు చేకూర్చేందుకేనని మండిపడ్డారు. ఈ పన్నులు దేశంలోని చిన్న వ్యాపారులు, విక్రేతలు, పారిశ్రామికవేత్తలకు నష్టం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటరీ ఆర్థిక స్థాయి సంఘం చైర్మన్‌ భర్తృహరి మాట్లాడుతూ..సమావేశంలో కొందరు ఎంపిలు ఈ అంశాన్ని లేవనెత్తారని, అయితే కమిటీ తదుపరి సమావేశంలో చర్చకు తీసుకునే అవకాశం ఉందని తెలిపిందని అన్నారు. రూ.2,000కంటే ఎక్కువ విలువైన యుపిఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం 0.4శాతం మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండిఆర్‌) ఛార్జీలను విధించిన సంగతి తెలిసిందే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్