ఆదివారం, 19 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్ విడుదల..

7 గంటల క్రితం

Wangchuk
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 10:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: దేశంలో నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు నిరసనగా ఢిల్లీలో నిర్వహించిన ఆందోళనలో పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్ ను ఆదివారం ఉదయం 8.30 గంటలకు సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం వాంగ్‌చుక్ రక్తపోటు (బీపీ), పల్స్ రేటు వంటి కీలక ఆరోగ్య సూచీలు స్థిరంగా ఉన్నాయి. అయితే దీర్ఘకాలిక నిరాహార దీక్ష, శారీరక శ్రమ ప్రభావంతో రక్త పరీక్షల ఫలితాల్లో స్వల్ప మార్పులు కనిపించాయని తెలిపారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా నివారించేందుకు ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ ఆస్పత్రుల నిపుణుల బృందం 24 గంటలపాటు క్లినికల్ మానిటరింగ్ నిర్వహిస్తూ, రక్తం సహా ఇతర పరీక్షల నివేదికలను నిరంతరం పరిశీలిస్తున్నట్లు ఆస్పత్రి యంత్రాంగం వెల్లడించింది.


దేశంలో నీట్ పేపర్ లీక్ కు నిరసనగా ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు 21 రోజుల నుంచి ఆయన ఈ దీక్షను కొనసాగిస్తుండగా.. అతని ఆరోగ్యం పూర్తిగా విషమించింది. దీంతో ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు శనివారం ఉదయం సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి విక్రమ్ మోహన్ మెమోరియల్ మెడికల్ కాలేజ్ , సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్