- బిసిల నుంచి ఇస్లాంలోకి మారిన వారికి రిజర్వేషన్లపై తమిళనాడు
- తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : వెనుకబడిన తరగతులు నుంచి ఇస్లాంలోకి మారిన వారికి రిజర్వేషన్లను సమర్థిస్తూ తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బిసిలతో పాటు అత్యంత వెనుకబడిన తరగతులు, డినోటిఫైడ్ కమ్యూనిటీలు, షెడ్యూల్డ్ కులాల నుంచి ఇస్లాంలోకి మారిన అర్హులైన వ్యక్తులకు "వెనుకబడిన తరగతుల (ముస్లిం) కమ్యూనిటీ సర్టిఫికేట్లు" జారీ చేసే అధికారం రాష్ర్ట ప్రభుత్వానికి ఉందని ఈ పిటిషన్‌లో తమిళనాడు తెలిపింది. అలాగే, వీరికి రిజర్వేషన్ల ప్రయోజనాలను కల్పించడానికి ఒక విధానాన్ని రూపొందించి, అమలు చేసే రాష్ట్ర అధికారాన్ని ధృవీకరించాలని కూడా ఈ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. మద్రాస్ హైకోర్టు ఈ పిటిషన్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో సుప్రీంకోర్టును తమిళనాడు ప్రభుత్వం ఆశ్రయించింది. 2024 జూన్ 25న ఇచ్చిన తీర్పులో "ఇస్లాం మతాన్ని స్వీకరించిన వ్యక్తి వెనుకబడిన తరగతి (ముస్లిం) హోదాను పొందలేరు" అని హైకోర్టు పేర్కొంది. అయితే ఈ తీర్పు రాజ్యాంగ విరుద్దమని తమిళనాడు ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు.








కామెంట్‌లు (0)