బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రసాయనాలు లీకై ముగ్గురు కార్మికులు మృతి

1 గంట క్రితం

fire accdeint
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 10:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- కర్ణాటకలో ఇద్దరి పరిస్థితి విషమం

- గాయపడిన వారిలో ఇద్దరు ఆంధ్రులు

యాద్గిర్: కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా కడేచూర్-బదియల్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రసాయన లీకేజీ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.మృతులను మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాకు చెందిన విక్రమ్, సంజయ్, అలాగే తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గణేష్గా గుర్తించారు. వీరి వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, తెల్లవారుజామున 1 గంట నుంచి 2 గంటల మధ్య ఫ్యాక్టరీలోని ప్లాంట్‌లో రసాయన లీకేజీ చోటుచేసుకుంది. ఘటన అనంతరం ఐదుగురు కార్మికులను రాయచూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించగా, వారిలో ముగ్గురు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గాయపడిన వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన హేమంత్, శివకుమార్ చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని యాద్గిర్ జిల్లా ఎస్పీ పృథ్వీక్ శంకర్ సీనియర్ పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. లీకైన రసాయనం ఏదన్నది, ప్రమాదానికి దారితీసిన కారణాలేమిటన్నదిపై అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్