సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యమునా ఎక్స్‌ప్రెస్‌‌వేపై ఘోరం

3 రోజుల క్రితం

యమునా ఎక్స్‌ప్రెస్‌‌వేపై ఘోరం
బస్సు దగ్ధమై తొమ్మిదిమంది సజీవ దహనం
ప్రయాణికులు అప్రమత్తం చేసినా ఆపని బస్సు డ్రైవర్‌
హత్యాయత్నం కింద డ్రైవర్, కండక్టర్‌ అరెస్టు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 09:25 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- బస్సు దగ్ధమై తొమ్మిదిమంది సజీవ దహనం

- ప్రయాణికులు అప్రమత్తం చేసినా ఆపని బస్సు డ్రైవర్‌

- హత్యాయత్నం కింద డ్రైవర్, కండక్టర్‌ అరెస్టు

న్యూఢిల్లీ : యమునా ఎక్స్‌‌ప్రెస్‌‌వేపై ఘోర ప్రమాదం సంభవించింది. స్లీపర్‌ ‌కోచ్‌ బస్సులో మంటలు చెలరేగి తొమ్మిదిమంది సజీవ దహనమయ్యారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ నుంచి ఉత్తర ప్రదేశ్‌ ఝాన్సీ జిల్లా మహోబా బయలుదేరిన ఈ బస్సు కేవలం 33 కిలోమీటర్లు ప్రయాణించి అగ్ని ప్రమాదానికి గురయింది. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా జేవార్ ప్రాంతంలో, నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికుల కథనం ప్రకారం... 35 మందితో బస్సు బయలుదేరిన కొద్ది సేపటికే డ్రైవర్ క్యాబిన్ నుంచి పొగ వచ్చింది. కాలుతున్న వాసన వస్తోందని డ్రైవర్, కండక్టర్‌ను అప్రమత్తం చేశారు. పొగతాగుతున్న వారు పట్టించుకోలేదు. బస్సు ఆపి ఎలాంటి తనిఖీ చేయలేదు. అప్పటికి కూడా పొగతాగడం ఆపలేదు. కొద్ది నిమిషాలకే డ్రైవర్ సీట్ వద్ద ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రయాణికులు వేడుకున్నా అప్పటికి కూడా డ్రైవర్‌ వాహనాన్ని ఆపకపోగా.. ‘ బస్సు ఆపను, మీరు చనిపోయినా నాకు పర్వాలేదు’ అని చెప్పాడు. ఆ తర్వాత బస్సు అంతటా వేగంగా మంటలు వ్యాపించాయి. ఎట్టకేలకు బస్సు ఆగిన తరువాత కొంతమంది ప్రయాణికులు పై నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే 10 అగ్నిమాపక వాహనాలను ఘటనా స్థలానికి అధికారులు పంపారు. సిబ్బంది రాత్రంతా మంటలను అదుపులోకి తీసుకురావడానికి, ప్రయాణికులను రక్షించడానికి శ్రమించారు. ప్రాథమిక విచారణలో బస్సులోని ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లో పేలుడు సంభవించడం వల్ల ఇంజిన్‌లోని లూబ్రికేటింగ్ ఆయిల్ మండి, మంటలు వేగంగా వ్యాపించాయని వెల్లడైంది. ప్రయాణికుల ఫిర్యాదుతో డ్రైవర్‌, కండక్టర్‌‌లపై హత్యాయత్నం అభియోగాలతో కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్నారు. బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు చెరో రూ.2 లక్ష‍ల చొప్పున, క్ష‍తగాత్రులకు చెరో రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.

బస్సుపై రూ.1.59 లక్ష‍ల విలువైన 17 పెండింగ్‌ చలానాలు

ఈ బస్సు యాజమాన్యం ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడమే ఈ ఘోరానికి కారణమని పలువురు విమర్శిస్తున్నారు. బీహార్‌లోని మధుబని జిల్లాలో రిజిస్టర్ అయి ఉంది. రాజ్ కల్పనా ట్రావెల్స్ ఈ స్లీపర్ కోచ్ బస్సును నడుపుతోంది. మంగళవారం నాటికి ఈ బస్సుపై రూ.

\1.59 లక్షల విలువైన 17 పెండింగ్ చలానాలు ఉన్నాయి. మైనర్‌ ఈ వాహనాన్ని నడిపినందుకు అపరాధ రుసుము కూడా విధించారు. అయినా, ఎటువంటి ముందుజాగ్రత్తలు తీసుకోకుండా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్