మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

త్రిపుర డిజిపి ఆత్మహత్య?

17 గంటల క్రితం

tripura dgp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 01:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అగర్తలా: త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ సోమవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయనను వెంటనే అగర్తలాలోని జీబీ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. సంఘటన జరిగిన వెంటనే పలువురు సీనియర్ అధికారులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభించగా, మృతికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక, విచారణ అనంతరం వెల్లడికానున్నాయి. అనురాగ్ ధంకర్ 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2025లో త్రిపుర డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్