బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మేము ఏ కూటమిలోనూ భాగం కాదు : వామపక్ష‍ాలు

01 జులై, 2026

Veerapandian
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 05:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : తాము ఏ కూటమిలోనూ భాగం కాదని వామపక్ష‍ాలు బుధవారం ప్రకటించాయి. టివికె వ్యవస్థాపకుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ అధికారంలో భాగస్వామ్యమైన పార్టీలకు నేడు చిన్న సమావేశం విందును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి వామపక్ష‍ాలు హాజరుకాలేదు. ఈ విషయంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వీరపాండియన్‌ మాట్లాడుతూ.. తాము ప్రభుత్వానికి బయటి నుండి మద్దతునిస్తాము కానీ ఏ కూటమిలోనూ భాగస్వామ్యం కాదని స్పష్టం చేశారు. కూటమిలో భాగమని భావన కలిగించేందుకు సుముఖంగా లేమని అన్నారు. కార్మికులు, సమాజంలోని ఇతర వర్గాల సమస్యలను సిఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు త్వరలో ఆయనతో సమావేశమవుతామని వామపక్ష‍ాల పార్టీలు తెలిపాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్