శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిద్యార్థి ఉద్యమం విస్తరిస్తాం

1 గంట క్రితం

cjp.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 01:06 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సిజెపి నేత అజింక్య షిండే, ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి సృజన్‌ భట్టాచార్య

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించే వరకు ప్రతిరోజూ జంతర్‌మంతర్‌కు ప్రదర్శనలు నిర్వహిస్తామని సిజెపి నాయకుడు, తాజా నిరసనలకు నాయకత్వం వహిస్తున్న అజింక్య షిండే, ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి సృజన్‌ భట్టాచార్య ప్రకటించారు. ఢిల్లీలో ఓటు చోరీకి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై పోలీసులు రోజంతా దాడులు చేసి, నిర్బంధించి, హింసించారని విమ‌ర్శించారు. శ‌నివారం నాడిక్క‌డ హ‌రికిష‌న్ సింగ్ సుర్జిత్‌ భవన్‌లో సిజెపి, ఎస్‌ఎఫ్‌ఐ సహా పలు విద్యార్థి సంఘాలు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా అజింక్య షిండే మాట్లాడుతూ జ్ఞానేశ్‌ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌ పదవి నుంచి తొలగించే వరకు ప్రతిరోజూ జంతర్‌మంతర్‌కు ప్రదర్శనలు కొనసాగిస్తామని తెలిపారు. పోలీసులు అభిజిత్‌ దీప్కే తదితరుల పట్ల అమానవీయంగా వ్యవహరించారని విమర్శిం చారు. ‘పోలీసులు మిమ్మల్ని ఎక్కడ ఆపినా, మీరు మీ జంతర్ మంతర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఆంక్షలు ఉన్నప్పటికీ నిరసన స్థలం వైపు ముందుకు సాగాలి’ అని యువతకు పిలుపునిచ్చారు. మోడీ, అమిత్ షాల అధికారాన్ని ప్రజల ఐక్యత సవాల్‌ చేసిందన్నారు. సృజన్‌ భట్టాచార్య మాట్లాడుతూ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అత్యంత విస్తృతమైన ఐక్యతను నిర్మించాలని పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో విద్యార్థులు శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తారని, పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే ఆ ప్రాంతాన్నే మరో జంతర్‌మంతర్‌గా మారుస్తారని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐవైఎఫ్‌ తదితర విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. నటుడు సుధన్వ దేశ్‌పాండే, చరిత్రకారుడు సొహైల్‌ హష్మీ, ప్రొఫెసర్‌ నందితా నారాయణ్‌ సహా మేధావులు మద్దతు తెలిపారు.

​

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్