శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆధిక్యత సాధించేదెవరో..?

-163 నిమిషాల క్రితం

india.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 03:26 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఇండోర్‌లోనూ బ్యాటర్లదే హవా..

  • నేడు భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య మూడో టి20

  • రాత్రి 7.00గం.ల నుంచి

ఇండోర్‌: రాంచీ వేదికగా జరిగిన రెండో టి20లో పరుగుల వరద పారడంతో ఆదివారం జరిగే మూడో టి20కి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మైదానం కూడా బ్యాటర్లకు అనుకూలమైన క్రమంలో మరోసారి పరుగుల వరద పారడం ఖాయం. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ జట్టు చేతిలో పరాజయం పాలైన టీమిండియా.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా ఉంది. చారిత్రాత్మక హోల్కర్ స్టేడియంలో భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఆదివారం మూడో టి20 జరగనుంది. భారత్, విండీస్ ఆటగాళ్లు ఇప్పటికే ఇండోర్‌ చేరుకొని ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. ఎయిర్‌పోర్ట్ నుంచి హోటల్స్, స్టేడియం వరకు ప్రత్యేక రూట్లలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా స్టేడియం దగ్గర సీసీటీవీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో పాటు పకడ్బందీ భద్రతను ఏర్పాటు చేశారు. తొలి టీ20లో మయాంక్ యాదవ్ నిరాశపర్చినా.. రెండో టీ20లో ఆకట్టుకున్నాడు. మూడు వికెట్లతో అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. కానీ మిగతా బౌలర్లు నిరాశపరచడంతో టీమిండియా ఓటమిపాలైంది. ఇక ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మకి తోడు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, తిలక్ వర్మ, నమన్ ధీర్, అక్షర్ పటేల్‌.. ఇలా బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలీయంగా ఉంది.

పరుగుల వరద ఖాయం...

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం పిచ్‌ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలం. చిన్న బౌండరీ లైన్లు ఉన్న క్రమంలో భారీ స్కోర్లు ఖాయం. రాంచీలో బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పడిన నేపథ్యంలో, ఇండోర్ పిచ్‌పై ఇరు జట్ల బౌలింగ్ వ్యూహాలు ఎలా ఉండ బోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మంచు ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు క్యూరేటర్లు తెలిపారు. ఈ టి20కి మూడో అంపైర్‌గా ఇండోర్‌కు చెందిన అంతర్జాతీయ అంపైర్ నితిన్ మీనన్ బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు.

జట్లు(అంచనా)...

భారత్‌: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, నమన్ ధీర్

వెస్టిండీస్: హోప్ (కెప్టెన్‌, వికెట్ కీపర్), హెట్‌మైర్, రోవ్‌మన్ పొవెల్, రూథర్‌ఫర్డ్, చేజ్, షెపర్డ్, అకీల్ హోసేన్, జోసెఫ్, కమిల్ పూరన్, ఫోర్డే, మోతీ.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్