రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం
ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లపై ఎపి క్యాబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ చేసిన సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్యాబినెట్ ఆమోదించిన వివరాల ప్రకారం... స్థానిక సంస్థల్లో వివిధ పదవులకు కొత్త బీసీ రిజర్వేషన్ల శాతాలను ఖరారు చేశారు. ఇందులో పంచాయతీ వార్డు మెంబర్స్‌లో బీసీలకు 26.73 శాతం రిజర్వేషన్లు, సర్పంచ్‌లలో 27.95 శాతం, ఎంపీటీసీలకు 25.55, ఎంపీపీల్లో 24.60, జడ్పీటీసీలకు 24.60 శాతం, జడ్పీ ఛైర్‌పర్సన్లకు 23.08 శాతం, అర్బన్ వార్డుమెంబర్లకు 32.78 శాతం మేర బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేలా నిర్ణయించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్లలో 32.03 శాతం, మేయర్లలో 35.02 శాతం మేర రిజర్వేషన్లు ఖరారు చేశారు.








కామెంట్‌లు (0)