జర్మనీపై 3-1తో గెలుపు
నవ్‌నీత్ రెండు గోల్స్
అత్యుత్తమ స్థానంతో ముగించిన అమ్మాయిలు
ఆమ్‌స్టెల్‌వీన్(నెదర్లాండ్స్): మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారతజట్టు అత్యుత్తమ స్థానంతో ముగించింది. వాఘెనెర్ హాకీ స్టేడియంలో 5వ స్థానానికి జరిగిన కీలక పోరులో భారత మహిళలజట్టు అద్భుత ప్రదర్శనను కనబర్చింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత జట్టు 3-1గోల్స్ తేడాతో పటిష్ట జర్మనీపై విజయం సాధించింది. నవ్‌నీత్ కౌర్ రెండు గోల్స్ కొట్టి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు క్వార్టర్‌లు ముగిసేసరికి ఇరుజట్లు గోల్స్ చేయలేదు. మూడో క్వార్టర్ చివర్లో 43వ నిమిషంలో ఇషికా, 44వ నిమిషంలో నవ్‌నీత్ కౌర్ ఒక్కో గోల్ చేయడంలో భారత్ 2-0 ఆధిక్యతలో నిలిచింది. ఇక నాల్గో, చివరి క్వార్టర్ ప్రారంభంలోనే నవ్‌నీత్ కౌర్(47వ ని.)లో మరో గోల్ చేయడంలో భారత మహిళల జట్టు 3-0 ఆధిక్యతలో నిలిచింది. దీంతో షాక్‌కు గురైన జర్మనీ భారత గోల్‌పోస్ట్‌పై దాడులు పెంచినా ప్రయోజనం లేదు. భారత డిఫెండర్లు, కెప్టెన్ సలీమా టేటేకి తోడు గోల్ కీపర్ సవిత సమర్ధవంతంగా తిప్పికొట్టారు. కానీ 59వ నిమిషంలో క్రింగ్ లిన్ గోల్ చేయడంలో భారత్ ఆధిక్యతను 3-1కు తగ్గించగల్గింది. ఎఫ్‌ఐహెచ్ ర్యాంకింగ్స్‌లో జర్మనీ 5వ ర్యాంక్‌లో ఉండగా.. భారత్ 9వ స్థానంలో ఉన్నాయి. గురువారం జరిగిన ఇతర మ్యాచుల్లో ఇంగ్లాండ్ మహిళలజట్టు 3-1తో అమెరికాను ఓడించి 9వ స్థానంలో నిలువగా.. 11వ స్థానానికి జరిగిన మరో మ్యాచ్‌లో జపాన్ 2-1తో స్కాట్లాండ్‌ను చిత్తు చేసింది. ఐర్లాండ్ జట్టు 1-0తో దక్షిణాఫ్రికాను ఓడించి 13వ స్థానంలో నిలువగా.. 15వ స్థానానికి జరిగిన మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 3-2తో చిలీని చిత్తుచేసింది.








కామెంట్‌లు (0)