బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమోగిన స్థానిక నగారా..

1 గంట క్రితం

విజయవాడ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగిన మిడియ సమావేశంలో నోటిపికెషను విడు.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 02:07 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

• కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు 28న

• జడ్‌‌పిటిసి, ఎంపిటిసిలకు నవంబర్‌ 3‌న

• పంచాయతీలకు మూడు దశల్లో పోలింగ్‌

• డిసెంబర్‌ రెండు నాటికి ప్రక్రియ పూర్తి

• అభ్యర్థులకు 24 గంటల్లో ధృవ పత్రాలు
• రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ ‌చంద్ర పునేఠా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ర్టంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఇసి) అనిల్‌ చంద్ర పునేఠా ఎన్నికల షెడ్యూల్‌‌ను బుధవారం విడుదల చేశారు. ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. పట్టణ స్థానిక సంస్థలు (కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, జడ్‌‌పిటిసిలు-ఎంపిటిసిలు, గ్రామ పంచాయతీలకు వేర్వేరుగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఈ నెల 28వ తేదిన ఒకే దఫా పోలింగ్‌ ‌జరగనుంది. ఎంపిటిసి, జడ్‌‌పిటిసిలకు నవంబర్‌ మూడవ తేదిన పోలింగ్‌ ‌ నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీలకు మూడు విడతలుగా నవంబర్‌ 26, నవంబర్‌ 29, డిసెంబర్‌ ‌రెండున పోలింగ్‌ ‌జరగనుంది. మొత్తం ఎన్నికల ప్రక్రియ డిసెంబర్‌ ‌రెండు నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఎస్‌‌ఇసి చెప్పారు.

రాష్ట్రంలో మొత్తం 123 అర్బన్‌ ‌స్థానిక సంస్థలుండగా, వంద సంస్థల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినందున ప్రభుత్వపరంగా కొత్త సంక్షేమ పథకాల ప్రారంభం, ప్రకటనలు ఇవ్వడం నిషేధిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌తెలిపారు.

జడ్‌‌పిటిసిలు...ఎంపిటిసిలకు ఇలా..

రాష్ట్ర వ్యాప్తంగా జడ్‌‌పిటిసి, ఎంపిటిసిలకు ఈ నెల 21వ తేదినుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 23వ తేది వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్‌ 3‌వ తేది పోలింగ్‌ ‌నిర్వహించి ఐదవ తేదిన ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ​

23 పట్టణ స్థానిక సంస్థల్లో వాయిదా

వివిధ కారణాలతో 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలను వాయిదా వేశారు.ఈ జాబితాలో రాష్ట్ర రాజధాని పరిధిలో ఉన్న మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థతో పాటు, రాజమహేంద్రవరం, కాకినాడ, శ్రీకాకుళం కార్పొరేషన్లు ఉన్నాయి. ఇవిగాక మరో 15 మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల్లోకూడా ఎన్నికలు వాయిదా పడ్దాయి. ఇక్కడ అవసరమైన ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ చేస్తామని, వీలైనంతవరకు డిసెంబరులోగా ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని ఎస్‌ఇసి చెప్పారు. నగర పాలక సంస్థల మేయర్‌‌, మున్సిపాల్టీల ఛైర్‌‌పర్సన్‌ ‌పదవులకు ఈ సారి ప్రత్యక్షంగాఎన్నికలు నిర్వహించనున్నారు. డిప్యూటీ మేయర్‌, వైస్‌ ఛైర్‌ ‌పర్సన్‌ ‌పదవులకు మాత్రం పరోక్ష పద్దతిలో ఎన్నికలు జరగనున్నాయి.

table 1

table 2

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్