విపత్తుల నిర్వహణ సంస్థ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపరితల ఆవర్తనం నుండి మన్నార్ గల్ఫ్, నైరుతి బంగాళాఖాతం మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీంతోపాటు ఈశాన్య రుతుపవనాల రాకతో ఐదు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని హెచ్చరించారు. గురువారం నాడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టిఆర్, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.







కామెంట్లు (0)