బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా విశాల ఐక్య ప్రజా వేదిక

1 గంట క్రితం

prakasnew.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 02:02 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ‘పీపుల్‌ ఎగైనెస్ట్‌ ఎస్‌ఐఆర్‌’ పేరిట ఏర్పాటు

  • మేధావులు, కళాకారులతో కలిసి వామపక్ష‍ాలు, కార్మిక, ప్రజా సంఘాల ఉమ్మడి పోరు

ప్ర‌జాశ‌క్తి - న్యూఢిల్లీ బ్యూరో : ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేస్తూ ఒంటెద్దు పోకడలతో వ్యవహరించిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సిఇసి) జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాల ఐక్య ప్రజా వేదిక ఆవిర్భవించింది. వామపక్ష‍ాల దిశానిర్దేశనంలో కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలు, పౌర వేదికలు, సాంస్కృతిక, కళా రంగాలకు చెందిన నాయకులు, మేధావులు, న్యాయవాదులు ఇందులో భాగస్వామ్యం కానున్నారు. ‘పీపుల్‌ ఎగైనెస్ట్‌ ఎస్‌ఐఆర్‌’ పేరుతో ఏర్పాటైన ఈ వేదిక తొలిదశలో సిఇసి రాజీనామా, ఎస్‌ఐఆర్‌ ‌ప్రధాన డిమాండ్‌‌తో పోరాటాన్ని ఉధృతం చేయనుంది. ఈ మేరకు బుధ‌వారం న్యూఢిల్లీలోని హ‌రికిష‌న్ సుర్జీత్‌ భవన్‌లో జరిగిన కన్వెన్షన్‌లో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఎస్‌ఐఆర్‌ ఆధారంగా నిర్వహించిన ఎన్నికలను రద్దు చేయాలని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించిన ఓటర్ల జాబితానే కొనసాగించాలని, ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు చేపట్టాలని కూడా డిమాండ్‌ చేసింది. ఈ నెల 23న దేశంలోని ప్రధాన నగరాల్లో తొలి విడత దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది.

బూత్‌స్థాయి నుంచి ప్రజలను సమీకరించేలా..

ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా బూత్‌స్థాయి నుంచి ప్రజలను సమీకరించడం ఈ వేదిక ప్రధాన లక్ష్యమని కన్వెన్షన్‌ పేర్కొంది. రాజకీయ పార్టీలతోపాటు పౌర సంఘాలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, యువజనులు, విద్యార్థులు, మహిళలు సహా అన్ని రంగాల ప్రజలను ఐక్యంగా ఉద్యమంలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఓటు హక్కు పరిరక్షణ కోసం విస్తృత ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంపై దృష్టి సారించింది.

ప్రముఖుల భాగస్వామ్యం

ఈ కన్వెన్షన్‌లో సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సామాజిక కార్యకర్త, విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నాయకులు పి కృష్ణప్రసాద్‌, డాక్టర్‌ సునీలం, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌, డివైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు ఎఎ రహీం, ప్రధాన కార్యదర్శి హిమాగ్నరాజ్‌ భట్టాచార్య, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత జాయింట్‌ సెక్రటరీ ఐషీఘోష్‌ తదితరులు పాల్గొన్నారు. సుమారు 250 మంది ప్రతినిధులు హాజరై కొత్త ప్రజా వేదిక ఏర్పాటుకు మద్దతు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్