శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Asian Games: గోల్ఫ్‌లో ప్రణవికి స్వర్ణ పతకం

17 గంటల క్రితం

gold.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 10:18 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు 18వ స్వర్ణం

మహిళల వ్యక్తిగత గోల్ఫ్‌ విభాగంలో ప్రణవి స్వర్ణ పతకం సాధించారు. ఫైనల్లో సింగపూర్, చైనా క్రీడాకారుణులను వెనక్కి నెట్టి, ఈ విజయాన్ని దక్కించుకుంది. మహిళల గోల్ఫ్‌ విభాగంలో భారత్‌కు బంగారు పతకం రావడం ఇదే తొలిసారి. ఇక, ఇదే క్రీడాంశంలో బృంద విభాగంలో మన దేశానికి రజతం దక్కింది. ప్రణవి, అదితి అశోక్‌, దీక్షా దాగర్ త్రయం రెండోస్థానం నిలిచి, రజతం గెలిచింది.  దీంతో ఏషియన్ గేమ్స్‌లో భారత్‌ ఖాతాలో 18 స్వర్ణ పతకాలు చేరాయి. మొత్తంగా భారత్‌ ఇప్పటివరకు 78 పతకాలతో 5వ స్థానంలో కొనసాగుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్