సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసచివాలయ ఉద్యోగులపై పోలీసు నిర్బంధం తగదు : సిఐటియు

2 గంటల క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 09:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు (సచివాలయ) ఉద్యోగులు వారి సమస్యల పరిష్కారం కోసం ఆదివారం శాంతియుతంగా నిర్వహించిన నిరసనపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం సరైన చర్య కాదని సిఐటియు రాష్ట్ర కమిటీ పేర్కొంది. వందల మందిని అక్రమంగా అరెస్టు చేశారని, చివరికి అనారోగ్యంగా ఉన్న సిఐకి డ్యూటీలు వేసి ఆయన మరణానికి కారణమైన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌ ‌నరసింగరావు, ఎవి నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తప్పుబట్టారు. సచివాలయ ఉద్యోగుల నిరసనకు పోలీసు పర్మిషన్ ఇచ్చి ఉంటే అనారోగ్యానికి గురైన సిఐ మరణించే పరిస్థితి వచ్చేది కాదన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. నున్న సిఐ అహ్మద్ అలీ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరింది. సచివాలయ ఉద్యోగుల సమస్యలను అనేకమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా.. ఏమాత్రం స్పందించలేదన్నారు. విజయవాడ ధర్నాచౌక్‌‌కు బయలుదేరిన వేలాది మంది సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం బెదిరించిందని తెలిపారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేశారన్నారు. అడుగడుగున పోలీసులు విధించిన అడ్డంకులను ఛేదించుకుంటూ వేల సంఖ్యలో ఉద్యోగులు విజయవాడలోని ధర్నా చౌక్‌‌కు చేరుకున్నారన్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా శాంతియుతంగా ధర్నా చేశారన్నారు. సచివాలయ ఉద్యోగులను పోలీసులు బెదిరిస్తూ వారిపై దురుసుగా ప్రవర్తించడం, లాఠీచార్జ్ చేయడం, బలవంతంగా అరెస్టులు చేసి వందల మంది ఉద్యోగులను వివిధ పోలీస్టేషన్‌‌లకు తరలించారన్నారు. సచివాలయ ఉద్యోగుల నాయకులను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఉద్యోగుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్