గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionAsian Games: సెయిలింగ్‌, రెజ్లింగ్‌లో రజతాలు

1 గంట క్రితం

sailing.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 10:39 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • స్క్వాష్‌లో కాంస్యాలు

  • 20వ ఆసియా క్రీడలు

ఐచి-నగోయా(జపాన్): ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల వేట కొనసాగిస్తున్నారు. పురుషుల స్కిఫ్ సెయిలింగ్ విభాగంలో మను ఫ్రాన్సిస్, ప్రిన్స్ కురిసింకల్ నోబుల్‌ జోడీ, రెజ్లింగ్‌ 97కిలోల విభాగంలో నితేశ్‌ శివాచ్‌ రజత పతకాలు సాధించగా.. మహి ళల, పురుషుల స్వ్కాష్‌ టీం విభాగాల్లో భారత్‌కు కాంస్య పతకాలు దక్కాయి. సెయిలింగ్‌ విభాగంలో చైనా స్వర్ణం, హాంకాంగ్ కాంస్యం గెలుచుకున్నాయి. నితేశ్‌కు పురుషుల 97కిలోల రెజ్లింగ్‌ ఫైనల్‌కు చేరి స్వర్ణ పతకంపై ఆశలు రేపినా.. జపాన్‌ రెజ్లర్‌ ముందు నిలువరించలేకపోయాడు. గురువారం జరిగిన ఫైనల్లో నితేశ్‌ 0-4తో జపాన్‌కు చెందిన యురి నకజటో చేతిలో ఓటమిపాలయ్యాడు. ఇక మహిళల 62కిలోల విభాగం సెమీఫైనల్లో మాన్సీ అహ్లావత్‌ 6-0తో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, ఒలింపిక్‌ పతక విజేత నొనోకా అజాకీ(జపాన్‌) చేతిలో పోరాడి ఓడింది. దీంతో కాంస్య పతక పోటీకోసం మాన్సీ మరో సెమీస్‌లో ఓడిన ప్లేయర్‌తో తలపడనుంది.

squash womens.jpg

స్క్వాష్‌లో కాంస్యాలు: సెమీఫైనల్ పోరుల్లో భారత పురుషుల, మహిళల జట్లు రెండూ 1-2 తేడాతో పరాజయం పాలై పసిడి రేసు నుంచి వైదొలిగాయి. పురుషుల జట్టు మలేషియా చేతిలో, మహిళల జట్టు హాంగ్‌కాంగ్‌(చైనా) చేతిలో ఓటమి చవిచూసాయి. గత ఎడిషన్‌లో స్వర్ణం సాధించి, ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత పురుషుల జట్టు మలేషియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అభయ్ సింగ్ తీవ్రంగా శ్రమించినప్పటికీ 8-11, 8-11, 8-11 తేడాతో ఎయిన్ యోన్గ్ చేతిలో ఓడాడు. ఇక వీర్ చోత్రాని భారత్‌కు ఆశలు చిగురింపజేశాడు. సంజయ్ జీవాపై 11-4, 11-8, 11-5 తేడాతో కేవలం 11 నిమిషాల్లోనే వరుస గేమ్‌ల్లో ఘనవిజయం సాధించాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది. కానీ చివరి పోరులో మలేషియా అద్భుత ప్రదర్శన చేయడంతో భారత్ ఫైనల్ ఆశలు ఆవిరయ్యాయి. మహిళల స్క్వాష్ సెమీస్‌లో అనాహత్ సింగ్, జోష్నా చినప్ప, తన్వి ఖన్నా, షమీనా రియాజ్తో కూడిన భారత జట్టు సెమీఫైనల్లో హాంకాంగ్(చైనా) చేతిలో ఓడింది. అనహత్‌సింగ్‌ 3-2 (11-9, 11-8, 6-11, 11-13, 10-12)తో ఛాన్‌ సిన్‌ యూక్‌ చేతిలో ఐదుసెట్ల హోరాహోరీ పోరులో పోరాడి ఓడాడు. తన్వీ ఖన్నా 3-1 (4-11, 13-11, 11-9, 13-11)తో లీగ్‌ క యుపై గెలిచాడు. దీంతో స్కోర్‌ 1-1తో సమమైంది. నిర్ణయాత్మక మ్యాచ్‌లో జోష్నా చిన్నప్ప 3-0 (11-4, 11-7, 11-9) వరుససెట్లలో హో-తెజ్‌-లోక్‌ చేతిలో ఓటమిమితో భారత మహిళల పోరాటం ముగిసింది. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత మహిళల బృందం కాంస్య పతకం సాధించింది. దీంతో సెమీస్‌లో ఓడిన భారత జట్టుకు కాంస్యం ఖాయమైంది.

vollyball.jpg

పురుషుల వాలీబాల్‌లో భారత్‌ పోరాటం క్వార్టర్‌ ఫైనల్లో ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారతజట్టు 0-3(19-25, 23-25, 18-25)తో పాకిస్తాన్‌ చేతిలో ఓటమిపాలైంది. ఈ విభాగంలో భారత్‌కు చివరి సారిగా 1986 ఆసియా క్రీడల్లో కాంస్యం, 1962లో రజత పతకం దక్కాయి.

క్రికెట్‌ ఫైనల్‌కు భారత్‌, పాకిస్తాన్‌

పురుషుల క్రికెట్‌లో టీమిండియా స్వర్ణ పతకానికి చేరువైంది. గురువారం జరిగిన సెమీస్‌లో భారతజట్టు 124 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. గురువారం జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌లకూ అంతరాయం కలిగింది. ముఖ్యంగా పాకిస్తాన్‌-శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను 13ఓవర్లకు కుదించారు. టాస్‌ గెలిచిన పాక్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 13 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ఛేదనలో పాకిస్తాన్‌ 11.3 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి విజయం సాధించింది. అనంతరం జరిగిన రెండో సెమీ ఫైనల్లో శ్రీలంక టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోగా.. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. అనంతరం భారత బౌలర్ల ధాటికి శ్రీలంక 9.5 ఓవర్లలో కేవలం 45 పరుగులకే కుప్పకూలింది. దీంతో శ్రేయస్‌ అయ్యర్‌ సేన 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. ఫైనల్లో అడుగుపెట్టింది. గత ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా శ్రీలంక వేదికగా ఈ ఏడాది ఫిబ్రవరి 15న తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌ను 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది. శనివారం భారత్‌, పాకిస్తాన్‌ జట్ల మధ్య స్వర్ణ పతక పోరు, శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య కాంస్య పతక పోటీ జరగనున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్