గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionAsian Games:చివరి నిమిషంలో గోల్‌తో ఫైనల్‌కు భారత హాకీ జట్టు

1 గంట క్రితం

hokey-2.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 10:42 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఉత్కంఠ సెమీస్‌లో పాకిస్తాన్‌పై గెలుపు

  • 3న స్వర్ణ పతకానికి మలేషియాతో ఢీ

  • నేడు మహిళల హాకీ ఫైనల్లో చైనాతో భారత్‌ ఢీ

ఐచి-నగోయా(జపాన్): భారత పురుషుల హాకీ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. పాకిస్తాన్‌తో గురువారం జరిగిన సెమీ ఫైనల్లో చివరి నిమిషంలో గోల్‌ కొట్టి ఫైనల్‌కు దూసువెళ్లింది. పాకిస్తాన్‌తో ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో భారత్‌ 4-3 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. దీంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌.. మరోసారి స్వర్ణ పతకానికి అడుగు దూరంలో నిలిచింది. కెప్టెన్‌, పెనాల్టీ కార్నర్‌ స్పెషలిస్ట్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (5, 15ని.) రెండు గోల్స్‌ చేయగా.. సింగ్‌ సుఖ్‌జీత్‌(23వ ని.), అభిషేక్‌ (60వ. ని)లో ఒక్కో గోల్‌ కొట్టారు. ఇక పాకిస్తాన్‌ తరఫున మహ్మద్‌ అబు(30వ ని.), షాహిద్‌ హనన్‌(45వ ని.), రాణా వాహీద్‌(49వ ని.)లో ఒక్కో గోల్‌ చేశారు. టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ తొలి గోల్‌ చేయడంతో భారత్‌ గోల్స్‌ ఖాతా తెరిచింది. హర్మన్‌ మరోసారి విజృంభించి తొలి క్వార్టర్‌ ముగిసేసరికి భారత్‌ ఆధిక్యం 2-0కు పెరిగింది. సుఖ్‌జీత్‌ సింగ్‌ మూడో గోల్‌ చేయడంతో భారత్‌ 3-0తో ముందంజ వేసింది. అయితే, ఆ తర్వాత పాకిస్తాన్‌ కెప్టెన్‌ అబూ మహమూద్‌ గోల్‌ కొట్టి జట్టును తిరిగి పోటీలో నిలిపాడు. దీంతో రెండో అర్ధ భాగం మొదలయ్యేసరికి స్కోరు 3-1గా ఉంది. ఆ తర్వాత హనన్‌ షాహిద్‌ భారత డిఫెన్స్‌ను బోల్తా కొట్టించి తెలివిగా గోల్‌ కొట్టాడు. అనంతరం వహీద్‌ రాణా కూడా గోల్‌ కొట్టగా స్కోరు 3-3తో సమమైంది. ఈ క్రమంలో గోల్‌ కీపర్‌ మోహిత్‌ను తప్పించి.. అతడి స్థానంలో సూరజ్‌ కర్కేరాను తీసుకురాగా.. ఇలాంటి దశలో పాక్‌కు రెండు పెనాల్టీ కార్నర్‌లు లభించినా వాటిని గోల్‌గా మలచలేకపోయింది. దీంతో భారత జట్టు ఊపిరి పీల్చుకుంది. ఈ క్రమంలో ఆటకు మరో నలభై సెకన్లలో ముగుస్తుందనగా అభిషేక్‌ అనూహ్య రీతిలో గోల్‌ కొట్టి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో భారత్‌ పాక్‌ను 4-3తో ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. భారత మహిళా హాకీ జట్టు కూడా ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే.

ఆసియా క్రీడల్లో ఇలా ఒకే ఎడిషన్‌లో భారత హాకీ మహిళల, పురుషుల జట్లు ఫైనల్‌కు చేరడం 1998 తర్వాత ఇదే తొలిసారి. మరో సెమీఫైనల్లో మలేషియా జట్టు 2-1తో దక్ష‍ిణ కొరియాను ఓడించి ఫైనల్‌కు చేరింది. భారత మహిళలజట్టు ఇప్పటికే ఫైనల్‌కు చేరి స్వర్ణ పతక పోటీకి చైనాతో అమీతుమీ తేల్చుకోనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్