గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఫోన్‌ రీచార్జ్‌‌తో రూ.లక్ష ప్రమాద బీమా..

1 గంట క్రితం

ఫోన్‌ రీచార్జ్‌‌తో రూ.లక్ష ప్రమాద బీమా
బిఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ ఆఫర్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 12:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • బిఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ ఆఫర్‌

​న్యూఢిల్లీ : ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ తన వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో ఉచిత బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ది ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎస్‌‌టివి 202, ఎస్‌‌టివి 2449 ప్లాన్లను రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు అదనపు రుసుము లేకుండా రూ.1 లక్ష వరకు ప్రమాద మరణ బీమా కవర్ ను కల్పించనున్నట్లు బిఎస్‌ఎన్‌ఎల్‌ ‌వెల్లడించింది. రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, పాము కాటు, పిడుగుపాటు, విద్యుత్ ఘాతం వంటి ప్రమాదాలు ఈ కవర్ పరిధిలోకి వస్తాయి. అదే విధంగా రూ.10,000 వరకు సైబర్ మోసం రక్షణను కూడా అందిస్తుంది. ఇందుకోసం బిఎస్‌ఎన్‌ఎల్ నంబర్ బ్యాంక్ ఖాతాతో అనుసంధానమై ఉండాలి. సైబర్ మోసం జరిగిన ఏడు రోజుల్లోపు ఫిర్యాదు చేసినప్పుడే క్లెయిమ్‌కు అర్హత ఉంటుంది.

​ఈ బీమా కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని బిఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. ఎంపిక చేసిన ప్లాన్లపై రీఛార్జ్ చేసిన 24 గంటల తర్వాత బీమా స్వయంగా యాక్టివ్ అవుతుందని పేర్కొంది. ప్లాన్ గడువు ముగిసే వరకు కొనసాగుతుందని పేర్కొంది. మరోవైపు భారత్ ఫైబర్ వినియోగదారుల కోసం ఒటిటి ఎంపిక విధానాన్ని కూడా సంస్థ మార్చింది. డిస్నీప్లస్‌ హాట్‌స్టార్, సోనీలివ్, జి5 సహా 25కి పైగా ఒటిటి ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తమకు నచ్చిన యాప్‌లను ఎంచుకునే అవకాశం కల్పించింది. బిఎస్‌ఎన్‌ఎల్ సినిమాప్లస్ పోర్టల్ ద్వారా వినియోగదారులు ప్రతి నెలా తమ ఒటిటి ఎంపికలను మార్చుకోవచ్చని సంస్థ వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్