ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Asian Games : స్క్వాష్‌లో భారత్‌కు రెండు రజతాలు

27 సెప్టెంబర్, 2026

Squash stars
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 03:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నాగోయా : 2026 ఆసియా గేమ్స్‌లో ఆదివారం స్క్వాష్‌ విభాగంలో భారత్‌కు రెండు రజత పతకాలు లభించాయి. మహిళల సింగిల్స్‌లో అనహత్‌ సింగ్‌, పురుషుల సింగిల్స్‌లో అభయ్‌ సింగ్‌ రన్నరప్‌గా నిలిచారు. ఆసియా క్రీడల్లో తొలిసారిగా భారత్‌ నుంచి స్క్వాష్‌ సింగిల్స్‌లో ఇద్దరు క్రీడాకారులు ఫైనల్‌కు చేరడం విశేషం. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో అనహత్‌ సింగ్‌ మలేషియాకు చెందిన శివసంగరి సుబ్రమణియంతో తలపడ్డారు. అయితే 4-11, 4-11, 7-11తో నేరుగా మూడు గేముల్లో ఓటమి చెందడంతో రజత పతకంతో సరిపెట్టుకున్నారు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో అభయ్‌ సింగ్‌ మలేషియాకు చెందిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఎన్‌గ్‌ ఈన్‌ యో చేతిలో 9-11, 5-11, 5-11తో పరాజయం పాలయ్యారు. దీంతో అభయ్‌ కూడా రజత పతకం సాధించారు.


స్క్వాష్‌ సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారత క్రీడాకారిణి

ఆసియా గేమ్స్‌లో స్క్వాష్‌ సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా అనహత్ సింగ్‌ (18) చరిత్ర సృష్టించారు. దీపికా పల్లికల్, జోష్న చిన్నప్ప మాత్రమే గతంలో కాంస్యాలను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అనహత్ ఆ రికార్డును అధిగమిస్తూ రజతపతకాన్ని దక్కించుకున్నారు. ఇక అభయ్ సింగ్‌ కూడా ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు చేరిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో సౌరభ్ ఘోషల్ ఫైనల్‌కు చేరుకుని పతకం సాధించాడు. ఇక ఒకే ఎడిషన్‌లో పురుషుల, మహిళల సింగిల్స్‌లో భారత అథ్లెట్లు ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్