గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిద్యార్థులకు చేరువగా గోల్ఫ్‌!

1 గంట క్రితం

Ziaguda-School-Kids1-1000x600.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 11:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : గోల్ఫ్‌ సంపన్నల ఆట కాదు, సామాన్యులు సైతం గోల్ఫ్‌ను కెరీర్‌గా ఎంచుకోవచ్చని ఐజిపిఎల్‌ (ఇండియన్‌ గోల్ఫ్‌ ప్రీమియర్‌ లీగ్‌) ప్రాంఛైజీ ఫీనిక్స్‌ హైదరాబాద్‌ ఫైర్‌బర్డ్స్‌ యజమాని ఆకాశ్‌ చుక్కలపల్లి అన్నారు. ఐజీపీఎల్‌ సీజన్‌ 2 సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 70 మంది విద్యార్థులకు హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌ (హెచ్‌జిసి) వేదికగా గోల్ఫ్‌పై బేసిక్‌ శిక్షణ అందించారు. ఎన్‌జీఏఐ ఎ సర్టిఫికేట్‌ కోచ్‌ అనూప్‌ సింగ్‌ విద్యార్థులకు గోల్ప్‌పై అవగాహన కల్పించటంతో హ్యాండ్స్ ఆన్‌ గోల్ఫ్‌ సెషన్‌ను పర్యవేక్షించారు. 'హైదరాబాద్‌ ప్రాంఛైజీకి ఫైర్‌బర్డ్స్‌ ప్రాతినిథ్యం వహించటం గర్వంగా ఉంది. దీనితో పాటు బాధ్యతలు లీడర్‌బోర్డును దాటాయి. విద్యార్థులకు గోల్ఫ్‌ శిక్షణ అందిస్తూ, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పటంతో పాటు తొలిసారి విద్యార్థులు గోల్ఫ్‌ ఆడటం చూస్తే సంతోషంగా ఉంది. మా జట్టుకు ఈ క్షణాలు ఎంతో మధురమైనవి' అని ఫీనిక్స్‌ హైదరాబాద్‌ ఫైర్‌బర్డ్స్‌ యజమాని ఆకాశ్‌ చుక్కలపల్లి అన్నారు. టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌, ఐజీపీఎల్‌ సీఈవో ఉత్తమ్‌ సింగ్‌, హెచ్‌జీఏ ప్రతినిధులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్