గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎట్టకేలకు చోళ చీఫ్స్‌ గెలుపు

1 గంట క్రితం

202610153979961-3f9aac84-3589-4250-8849-fe26cb509c51(1).jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 11:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆర్చర్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌2

హైదరాబాద్‌ : ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ (ఎపిఎల్) రెండో సీజన్‌లో చోళ చీఫ్స్‌ తమిళనాడు జట్టు వరుస పరాజయాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. లీగ్‌ దశలో వరుసగా ఐదు ఓటములు చవిచూసిన చోళ చీఫ్స్‌ తమిళనాడు గురువారం జరిగిన మ్యాచ్‌లో పృథ్వీరాజ్‌ యోధాస్‌పై ఉత్కంఠభరిత షూటాఫ్‌లో మెరుపు విజయం సాధించింది. రెగ్యులర్‌ సెట్లు 4-4తో సమం కాగా.. ఫలితాన్ని హిట్‌ ఆర్‌ మిస్‌ షూటాఫ్‌ ద్వారా తేల్చారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌ పీపుల్స్‌ప్లాజాలో జరుగుతున్న ఏపీఎల్‌లో గెలుపు బాట పట్టిన చోళ చీఫ్స్‌ టాప్‌-4లో నిలిచే ఆశలను సజీవంగా నిలుపుకుంది. తొలి సెట్లో 76-72తో, రెండో సెట్లో 78-77తో చోళ చీఫ్స్‌ ఆధిక్యం సాధించగా.. మూడో సెట్లో 75-73, నాల్గో సెట్లో 77-74తో యోధాస్‌ పైచేయి సాధించింది. హిట్‌ ఆర్‌ మిస్‌ షూటాఫ్‌లో చోళ చీఫ్స్‌ 2-0తో పైచేయి సాధించి విలువైన విజయం ఖాతాలో వేసుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్