గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎస్‌‌సి, ఎస్‌‌టి పారిశ్రామిక వేత్తల సమస్యలు పరిష్కరించండి : కెవిపిఎస్‌

2 గంటల క్రితం

kvps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 10:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని ఎస్‌‌సి,ఎస్‌టి పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చర్యలు చేపట్టాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ అధికారులకు లేఖలు రాసినట్లు కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.కేటాయించిన పారిశ్రామిక ప్లాట్ల రద్దు చర్యలను వెంటనే నిలిపివేయాలని, సంబంధిత పారిశ్రామికవేత్తల వాదనలు విని, పరిశ్రమల స్థాపనకు అదనపు గడువు ఇవ్వాలని కోరారు. ప్లాట్ల ధరల చెల్లింపు భారాన్ని తగ్గించేందుకు ఎస్‌‌సి,ఎస్‌‌టి సబ్‌ప్లాన్‌ నిధుల నుంచి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని కోరారు.ప్లాట్లకు సంబంధించిన మొత్తాన్ని పూర్తిగా చెల్లించిన వారికి తక్షణమే సేల్ డీడ్‌లు జారీ చేయాలని పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు వీలుకలిగి, పరిశ్రమల స్థాపన వేగవంతమవుతుందని తెలిపారు. రాబోయే ప్రభుత్వ ఉత్తర్వుల్లో సేల్ డీడ్‌ల జారీ అంశాన్ని స్పష్టంగా పొందుపరచాలని సూచించారు. బ్యాంకులతో సమన్వయం చేసుకుని రుణాల మంజూరు ప్రక్రియను సులభతరం చేయాలని, పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్