గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionక్రిమినల్‌ కేసుల వివరాలందించేలా పోలీసుల్ని ఆదేశించండి

1 గంట క్రితం

ycp.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 11:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • హైకోర్టులో వైసిపి పిటిషన్‌ : నేడు విచారణ

​ప్రజాశక్తి - అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వారిపై నమోదైన క్రిమినల్‌ కేసుల వివరాలను నిర్ణీత గడువులోగా అందించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టును వైసిపి ఆశ్రయించింది. ఎలాంటి కేసులు లేనివారికి ఆ విషయాన్ని ధ్రువీకరక్రమిస్తూ అధికారిక పత్రం జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరింది. నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో అభ్యర్థులు తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయా లేదా అనే వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలన్నింటినీ అభ్యర్థులు స్వయంగా తెలుసుకోవడం కష్టమని వైసిపి పేర్కొంది. అభ్యర్థులు తమ గుర్తింపు కార్డును జతచేసి ఏదైనా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తు చేసుకుంటే, రాష్ట్రవ్యాప్తంగా వారిపై నమోదైన కేసుల వివరాలను సేకరించి అందించేలా ఆదేశించాలని కోరింది.

కేసు నమోదైన పోలీస్‌స్టేషన్‌ పేరు, క్రైమ్‌ నంబరు, నమోదైన సంవత్సరం, వర్తించే సెక్షన్లు, దర్యాప్తు ఏ దశలో ఉందనే వివరాలతో కూడిన ధ్రువీకరణ పత్రాన్ని రెండు రోజుల్లోగా లేదా కోర్టు నిర్ణయించే గడువులోగా అందించాలని పిటిషన్‌లో అభ్యర్థించింది. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలని వైసిపి తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి గురువారం ఉదయం న్యాయమూర్తి జస్టిస్‌ వడ్డిబోయన సుజాత ముందు ప్రస్తావించారు. లంచ్‌మోషన్‌గా విచారించాలని కోరగా, శుక్రవారం విచారణ చేపడతామని న్యాయమూర్తి తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్