శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా చమిందా వాస్

59 నిమిషాల క్రితం

chaminda vas.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 10:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో తొలి టైటిల్‌ సాధనే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు కోచింగ్‌ విభాగంలో కీలక మార్పులు చేపడుతోంది. ఇందులో భాగంగా శ్రీలంక మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ చమిందా వాస్‌ను ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది. శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష సేవలందించిన వాస్‌కు ఫాస్ట్‌ బౌలింగ్‌లో అపార అనుభవం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసిన ఆయన, కోచ్‌గా కూడా పలు జట్లకు సేవలందించారు. గతంలో శ్రీలంక జాతీయ జట్టుతో పాటు శ్రీలంక క్రికెట్‌ అకాడమీలో పనిచేశారు. న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ జట్లకు కన్సల్టెంట్‌గా వ్యవహరించారు. ఆయన అనుభవం ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్లకు ఉపయోగపడుతుందని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది.

స్పిన్‌ కోచ్‌గా అమిత్‌ మిశ్రా

ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగంతో పాటు స్పిన్‌ బౌలింగ్‌పైనా ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రత్యేక దృష్టి సారించింది. భారత మాజీ లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రాను స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమించనున్నట్లు సమాచారం. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన మిశ్రా, తన అనుభవాన్ని యువ స్పిన్నర్లకు అందించనున్నారు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం ఆయనకు కొత్త అనుభవం కానుంది.

గంగూలీ, యువరాజ్‌లకు కీలక బాధ్యతలు

జట్టు కోచింగ్‌ వ్యవస్థలో సౌరవ్‌ గంగూలీకి కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ క్రికెట్‌ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న గంగూలీ, హెడ్‌ కోచ్‌గా జట్టును నడిపించనున్నారు. మరోవైపు, భారత జట్టు మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో యువరాజ్‌కు ఉన్న అనుభవం, యువ బ్యాటర్లకు మార్గదర్శకత్వం వహించే సామర్థ్యం జట్టుకు కలిసివస్తాయని భావిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్