నామినేషన్లు వేయకుండా వైసిపి నేతలను అడ్డుకున్న పోలీసులు..
హైకోర్టును ఆశ్రయిస్తాం... చివరి వరకు పోరాడతాం..
ప్రజాశక్తి-పల్నాడు: పల్నాడు జిల్లాలో గురజాల, దాచేపల్లి ఛైర్మన్ అభ్యర్థులతో పాటు వైసిపి నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి, నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో తనను సైతం పోలీసులు శుక్రవారం రాత్రి నుండి హౌస్ అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ మేరకు నరసరావుపేటలో తన నివాసంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పు చేతల్లో పని చేస్తున్నారని విమర్శించారు. ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనే హక్కును కాలరాస్తూ ప్రతిపక్ష నేతలను నిర్బంధించడం సరికాదన్నారు. పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయిస్తామని, న్యాయం జరిగే వరకు చివరి దాకా పోరాటం కొనసాగిస్తామని కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు.







కామెంట్లు (0)